తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడంటూ కేటీఆర్ పలు సభల్లో వ్యాఖ్యానించడాన్ని టిడిపి నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి తప్పుబట్టారు. అసలు ఎన్టీఆర్ ను మొదట వెన్నుపోటు పొడిచింది కేసీఆరేనని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. అలాగే ఆనాడు సంక్షోభ సమయంలో కూడా ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది కూడా కేసీఆరేనని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాలన్నింటి గురించి తెలుసుకుని కేటీఆర్ మాట్లాడాలని...అయినా పిల్లకాకికి ఈ విషయాలేలా తెలుస్తాయంటే కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. 

ఇక మంత్రి హరీష్ చంద్రబాబుకు రాసిన లేఖ పై కూడా రేవూరి స్పందించారు. చంద్రబాబును తిట్టడం ద్వారా కేసీఆర్ మెప్పు పొందాలని హరీష్ ప్రయత్నిస్తున్నారని  విమర్శించారు.చంద్రబాబుపై హరీష్ చేసిన ఆరోపణలు రేవూరి ఖండించారు. 

తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చిన విషయాన్ని హరీష్ గుర్తుంచుకోవాలన్నారు. హరీష్ వాస్తవాలు వక్రీకరించి అబద్దాలను ప్రచారం చేసే పనిలో పడ్డారని విమర్శించారు. తమ రాష్ట్ర హక్కులు కాపాడుకోవడం కోసం మాత్రమే ఏపి సీఎంగా చంద్రబాబు కేంద్రానికి లేఖలు ఇచ్చారని...దిగువ రాష్ట్రాలు నీటి పంపకాల విషయంలో ఇలా లేఖలివ్వడం సాధారణమే అని రేవూరి వివరించారు. 

 చంద్రబాబును విమర్శిస్తూ తన మనుగడ కాపాడుకోవాలని హరీష్ ప్రయత్నిస్తున్నట్లు రేవూరి స్పష్టం చేశారు. అసలు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం లేకపోతే స్వరాష్ట్రం సిద్దించేదా అని ప్రశ్నించారు. అలాంటి  వ్యక్తిని కూడా టీఆర్ఎస్ నాయకులు అవమానిస్తున్నారని రేవూరి మండిపడ్డారు.  మహా కూటమి పొత్తుల్లో భాగంగా టిడిపి 14 స్థానాల్లో పోటీ చేస్తుందని రేవూరి తెలిపారు. 

మరిన్ని వార్తలు

హరీష్‌రావు లేకుంటే కేసీఆర్ లేడు: రేవూరి

అప్పుడే వెనక్కి తగ్గుతా: హరీష్ పై వ్యాఖ్యల మీద రేవూరి

కట్టుబడి ఉన్నా: హరీష్‌ మీది వ్యాఖ్యలపై రేవూరి ప్రకాష్ రెడ్డి

టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు

ఆధారాలున్నాయి: హరీష్ పై మరోసారి వంటేరు సంచలనం

టీఆర్ఎస్‌లో హరీష్ స్థితిపై రేవూరి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం