హైదరాబాద్: తనను ప్రేమిస్తున్నానని చెబుతూనే మరో వ్యక్తితో ఝాన్సీ తిరుగుతోందని... ఈ విషయం నచ్చకనే  తాను ఆమెను దూరం పెట్టినట్టు ప్రియుడు సూర్య చెబుతున్నారు. ఝూన్సీ ఆత్మహత్యకు తనకు సంబంధం లేదని  ఆయన తెలిపారు.

ఈ మేరకు ఝాన్సీతో లవ్ ఎఫైర్  విషయమై సూర్యతో ఫోన్‌లో మీడియా ప్రతినిధి జరిపిన సంభాషణను ఓ తెలుగు న్యూస్ మీడియా ఛానెల్‌ బుధవారం నాడు ప్రసారం చేసింది. ఓ పుట్టినరోజు ఫంక్షన్‌లో ఝాన్సీ తనకు పరిచయమైందన్నారు.

అయితే సినిమా అవకాశాల కోసం ఝాన్సీని వాడుకోవాలని ఇద్దరు చూశారని సూర్య ఆరోపించారు. ఈ విషయాన్ని ఝాన్సీ తనకు చెబితే తాను వారిద్దరికీ కూడ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు. 

తనను ప్రేమిస్తున్నానని ఝాన్సీ చెప్పిందన్నారు. కానీ, ఈ విషయమై తాను ఆలోచిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో  ఇతరులతో కూడ ఆమె తిరుగుతున్న విషయాన్ని తెలుసుకొని  దూరం పెట్టినట్టు సూర్య తెలిపారు.

 ఆత్మహత్య చేసుకొనే ముందు ఝాన్సీ పెట్టిన మేసేజ్‌లను డిలీట్ చేసినట్టు సూర్య చెప్పారు. ఈ మేసేజ్‌లను డిలీట్ చేసిన తర్వాతే తాను చూసుకొన్నట్టు సూర్య తెలిపారు.  ఝాన్సీకి సీరియల్ అవకాశాలు లేవన్నారు.  సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని ఇద్దరు ఝాన్సీని వాడుకోవాలని భావించారని  సూర్య  ఈ సంభాషణలను చెప్పారు.

ఇదిలా ఉంటే తాను ఝాన్సీ ఆత్మహత్యకు లవ్ ఎఫైర్ కారణమని పోలీసులు చెబుతున్నారు.  ఝాన్సీ ఆత్మహత్య విషయమై అన్ని రకాల సాక్ష్యాలను  సేకరిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య: సెల్ఫీ వీడియో కీలకం

ప్రేమా, ఫ్యామిలీయా: ఝాన్సీని బలి తీసుకున్నది ఏది..?

టీవీ సీరియల్ నటి ఆత్మహత్య (వీడియో)

ఝాన్సీ ఆత్మహత్య వెనుక: ప్రేమ వ్యవహారమా, కుటుంబంలో తగాదాలా..?

నటి ఝాన్సీ ఆత్మహత్య.. కీలకంగా మారిన వాట్సాప్ చాట్

బ్రేకింగ్: బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య