బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె ఆత్మహత్య కేసులో వాట్సాప్ చాట్ కీలకంగా మారింది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో సాయి అపార్ట్ మెంట్ లో టీవీ నటి ఝాన్సీ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. ఈ కేసులో ఆమె ఫోన్ ని పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.

చనిపోవడానికి ముందు సూర్య అనే యువకుడితో ఝాన్సీ వాట్సాప్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
 
ఝాన్సీ స్వస్థలం కృష్ణా జిల్లా మద్దెనపల్లి మండలం వాడాలి గ్రామం. 6 నెలలుగా సూర్యతో ఝాన్సీ ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తోంది. సూర్య పరిచయం అయ్యాక సీరియల్స్‌కు కూడా దూరంగా ఉన్నట్లు సమాచారం. పవిత్రబంధం సీరియల్‌లో ఝాన్సీ నటించింది.