ప్రముఖ బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో ఝాన్సీ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలుగులో పలు సీరియళ్లలో నటించిన ఆమె మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా ఝాన్సీ గుర్తింపు పొందారు.

కాగా, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో గత కొంతకాలంగా కుటుంబసభ్యులతో గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సూర్య అనే వ్యక్తితో ఆమె గతకొంతకాలంగా సహజీవనం చేస్తోంది.

పెళ్లి ప్రతిపాదన పెట్టడంతో ఝాన్సీని సూర్య దూరం పెట్టాడు. మరోవైపు అతని కోసం సీరియల్స్‌కు సైతం ఆమె దూరమయ్యారు. నటనను వదులుకోవడం సూర్య మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.