హైదరాబాద్: ఆత్మహత్య చేసుకోవడానికి ముందు టీవీ సీరియల్ నటి ఝాన్సీ సెల్ఫీ వీడియో తీసినట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు గల కారణాలను ఆమె ఆ సెల్ఫీ వీడియోలో వివరించినట్లు భావిస్తున్నారు. దీంతో కేసులో ఈ వీడియో కీలకంగా మారింది.

ఝాన్సీ సెల్ఫీ వీడియో విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఝాన్సీ ప్రేమ వ్యవహారంపై బంధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందిన సూర్య అలియాస్ నానితో ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని ప్రస్తుతానికి భావిస్తున్నారు. 

సూర్యతో కలిసిన దిగిన ఆమె ఫొటో కూడా అందుబాటులోకి వచ్చింది.హైదరాబాద్ శ్రీనగర్‌ కాలనీలో వర్ధమాన సీరియల్‌ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని మరణించింది.

 మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తోంది.

సంబంధిత వార్తలు

ప్రేమా, ఫ్యామిలీయా: ఝాన్సీని బలి తీసుకున్నది ఏది..?

టీవీ సీరియల్ నటి ఆత్మహత్య (వీడియో)

ఝాన్సీ ఆత్మహత్య వెనుక: ప్రేమ వ్యవహారమా, కుటుంబంలో తగాదాలా..?

నటి ఝాన్సీ ఆత్మహత్య.. కీలకంగా మారిన వాట్సాప్ చాట్

బ్రేకింగ్: బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య