బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఝాన్సీ ప్రేమికుడిగా చెబుతున్న సూర్యతో ఆమె చేసిన వాట్సాప్ ఛాటింగ్ కేసులో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమ కూతురు ప్రేమ వ్యవహారం, సహజీవనం గురించి తనకు తెలిదయదన్నారు బుల్లితెర నటి ఝాన్సీ తల్లి. ఆత్మహత్య విషయం వెలుగు చూసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె సూర్య ఎవరో తమకు తెలియదన్నారు. కొద్దిరోజులుగా ఝాన్సీ షూటింగ్‌కు వెళ్లడం లేదని ఆమె తెలిపారు.

అయితే ప్రేమ వ్యవహారంలో గత కొంతకాలంగా కుటుంబసభ్యులతో గొడవలు జరుగుతుండటం... మంగళవారం రాత్రి కూడా ఝాన్సీని తల్లి మందలించిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  సూర్య అనే వ్యక్తితో గతకొంతకాలంగా సహజీవనం చేస్తోందని, పెళ్లి ప్రతిపాదన పెట్టడంతో ఝాన్సీని సూర్య దూరం పెట్టాడని, నటనకు దూరమవ్వడంతో పాటు ప్రేమలో విఫలమవ్వడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు సూర్య తమ కుటుంబానికి దూరపు బంధువేనన్నారు ఝాన్సీ తండ్రి. తాను ముదినేపల్లిలోనే ఉంటానని, ఇక్కడి వ్యవహారాలేవి తనకు తెలియదని తన భార్య, కుమారుడితో పాటు ఝాన్సీ హైదరాబాద్‌లోనే ఉంటుందని ఆయన తెలిపారు. ఆత్మహత్య విషయం తెలుసుకుని తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు.  

నటి ఝాన్సీ ఆత్మహత్య.. కీలకంగా మారిన వాట్సాప్ చాట్

బ్రేకింగ్: బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య