హైదరాబాద్: అభివృద్ధి పేరుతో అడవిని ధ్వంసం చేస్తుంటే ఎవరూ మాట్లాడడం లేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పర్యారవరణం నాశనం అవుతుంటే తనకు బాధ కలిగిందని ఆయన అన్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ సోమవారం జరిగిన అఖిల పక్ష భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

చిల్లర రాజకీయాలు చేయడానికి తాను రాలేదని, అడవిని ధ్వంసం చేస్తామంటే సహించబోమని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు ఒక్క ఎమ్మెల్యే సీటు రాకపోయినా మంచిదే కానీ ప్రజలు కన్నీరు పెడితే ఊరుకోనని ఆయన అన్నారు. ప్రజల కన్నీళ్లు తుడుస్తానని, అఖిల పక్షం చేపట్టే పాదయాత్రలో పాల్గొంటానని ఆయన చెప్పారు.

నల్లమలలో యురేనియం అన్వేషణ, తవ్వకాలను నిలుపుదల చేయాలి
 సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నల్లమలలో యురేనియం అన్వేషణ, తవ్వకాలను ఆపాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో ఇతర రాజకీయ పార్టీలు, ఎన్జీఓలు, సైంటిస్టులు, నల్లమల వాసులు, ఉద్యమకారులతో అఖిలపక్షం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ఇలా ఉంది...

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రమాదకర అణుధార్మిక ధాతువైన యురేనియం అన్వేషణ, తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలని అఖిల పక్షం డిమాండ్ చేస్తోంది. 
ఇప్పటికే యురేనియం అన్వేషణ, తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలను ఈ సభ కోరడం జరిగింది. 
కడప జిల్లా తుమ్మలపల్లిలో జరుగుతున్న యురేనియం మైనింగ్ ను తక్షణం ఆపాలని, తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానంలోని అంశాలపై ఇంకా స్పష్టతను ఇవ్వాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తోంది. 

అదే విధంగా గతంలో నల్గొండ జిల్లాలో యురేనియం అన్వేషణ తీరు వల్ల ప్రజలకు అపార నష్టం కలిగిందని, అందువల్ల ఈ అఖిల పక్ష సమావేశం సూచించిన డిమాండ్లకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ పై అంశాలను సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించింది.

సంబంధిత వార్తలు

సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ ను తిప్పికొట్టిన కేసీఆర్ వ్యూహం

సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ పై మంత్రి శ్రీనివాస గౌడ్ కామెంట్

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్

యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: తేల్చేసిన కేటీఆర్

సేవ్ నల్లమల: రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొనే నేతలు వీరే...

సేవ్ నల్లమల: తాతపై హిమాన్షు ట్వీట్, బిజెపిపై కేసీఆర్ అస్త్రం అదే...