తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం మానుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీ నేతలకు సూచించారు.  ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు... కాబట్టి ఇప్పుడు నిందించడం వల్ల లాభమేమీ ఉండకపోగా కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు సంయమనంతో ఉండాలని జగ్గారెడ్డి సూచించారు.  

వచ్చే ఐదేళ్లు తాను కేవలం సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ది గురించే పనిచేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. తనను గెలిపించుకున్న ప్రజలే తనకు ముఖ్యమన్నారు. అందుకోసం సీఎం, మంత్రులు ఎవరినైనా కలుస్తానని పేర్కొన్నారు. ఇలా మాట్లాడుతున్నందుకు తనను కొందరు పులి అన్నా, మరికొందరు పిల్లి అన్నా అది మీ ఇష్టమని...ఎవరేమనుకున్న నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

ఎన్నికల్లో ఇంత ఘోర పరాభవానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలే కారణమని జగ్గా రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు కేవలం వారం రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించడం మానుకోవాలి సూచించారు. ఇంకా చాలా విషయాలను పార్టీ మార్చుకోవాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి సూచించారు. 

సంబంధిత వార్తలు

త్వరలో కేసీఆర్‌ను కలుస్తా: పార్టీ మార్పుపై జగ్గారెడ్డి క్లారిటీ

జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడానికి సిద్దమే...కానీ...: హరీష్ సంచలనం

నేను గెలిస్తే హరీష్ ఔటే...: జగ్గారెడ్డి

కేసీఆర్,కేటీఆర్, హరీష్‌‌లపై జగ్గారెడ్డి తిట్ల దండకం....

నా ఇంట్లోనే ప్రతిపక్షం, పాపే అడుగుతుంది: జగ్గా రెడ్డి

సంగారెడ్డి అంటే జగ్గారెడ్డే: జయారెడ్డి