సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి)  టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్దంగా ఉన్నారని మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పార్టీలోకి ఎప్పుడు ఆహ్వానిస్తామా అని ఎదురుచూస్తున్నారని....కానీ అలాంటి  తెలంగాణ ద్రోహులకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎప్పటికీ స్థానం ఉండదని హరీష్ అన్నారు. 

 జగ్గారెడ్డి పూటకో పార్టీలో చేరుతూ గడియకో మాట మార్చే వ్యక్తి అని హరీష్ ఘాటుగా విమర్శించారు. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి మళ్లీ జైలుకు పోవడం  ఖాయమని హరీష్ అన్నారు. అలాంటి వ్యక్తిని  కాకుండా సంగారెడ్డి ప్రజలు వివాదరహితుడైన టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ను గెలిపించుకోవాలని హరీష్ పిలుపునిచ్చారు. 

ఇక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభిర్యం ప్రదర్శిస్తోందని హరీష్ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని ఈ సారి అదికూడా దక్కదని హరీష్ తెలిపారు.

మరిన్ని వార్తలు

నేను గెలిస్తే హరీష్ ఔటే...: జగ్గారెడ్డి

కేసీఆర్,కేటీఆర్, హరీష్‌‌లపై జగ్గారెడ్డి తిట్ల దండకం....

నా ఇంట్లోనే ప్రతిపక్షం, పాపే అడుగుతుంది: జగ్గా రెడ్డి

సంగారెడ్డి అంటే జగ్గారెడ్డే: జయారెడ్డి