Asianet News TeluguAsianet News Telugu

నా ఇంట్లోనే ప్రతిపక్షం, పాపే అడుగుతుంది: జగ్గా రెడ్డి

సంగారెడ్డి నియోజకవర్గంలో ఎల్లుండి(బుధవారం) నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తనతో పాటు తన భార్య నిర్మల కూడా నామినేషన్ వేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. 
 
congress leader jagareddy announcement on election campaign
Author
Sangareddy, First Published Oct 15, 2018, 6:42 PM IST

సంగారెడ్డి నియోజకవర్గంలో ఎల్లుండి(బుధవారం) నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తనతో పాటు తన భార్య నిర్మల కూడా నామినేషన్ వేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. 

ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి ఊరికి వివిధ హామీలిచ్చానని జగ్గారెడ్డి గుర్తు చేశారు.  అయితే ఆ హామీలను అమలు చేయించే భాద్యత తన కూతురు జయా రెడ్డి తీసుకుందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రశ్నించడానికి మా పాప రూపంలో ఇంట్లోనే నాకు ప్రతిపక్షం ఉందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కక్ష సాధింపులు ఉండవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ కుటుంబ అవినీతిని మాత్రం బయటపెడతామని...వారిని తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ),  కాకతీయ యూనివర్సిటీ (కేయూ) విద్యార్థుల కోసం ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిరుద్యోగ యువత కోసం కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా భారీ సంఖ్యలో ఇండస్ట్రీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు మంజీరా, సింగూరు నుండి తాగు, సాగు నీరు అందిస్తామన్నారు. అలాగే సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని జగ్గరెడ్డి హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

సంగారెడ్డి అంటే జగ్గారెడ్డే: జయారెడ్డి
 
Follow Us:
Download App:
  • android
  • ios