Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్,కేటీఆర్, హరీష్‌‌లపై జగ్గారెడ్డి తిట్ల దండకం....

సంగారెడ్డిలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌లతో పాటు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లపై తిట్లదండకం అందుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జగ్గారెడ్డి ప్రసంగించారు.  టీఆర్ఎస్ పార్టీ, నాయకులను తీవ్ర పదజాలంతో దూషించారు. 

 

congress leader jagga reddy fires on kcr family
Author
Sangareddy, First Published Oct 17, 2018, 4:52 PM IST

సంగారెడ్డిలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌లతో పాటు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లపై తిట్లదండకం అందుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జగ్గారెడ్డి ప్రసంగించారు.  టీఆర్ఎస్ పార్టీ, నాయకులను తీవ్ర పదజాలంతో దూషించారు. 

స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మంత్రి హరీష్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముగ్గురూ చేతకాని దద్దమ్మలేనని విమర్శించారు. వారికి దమ్మూ దైర్యం లేకే తనను జైళ్లో పెట్టారని అన్నారు. దీంతో తాను భయపడతానని వారు భావించారని కానీ తాను పులిలాంటి వాడినని జగ్గారెడ్డి అన్నారు. పులి బోనులో ఉన్నంత సేపే మాట్లాడదు...కానీ బైటికొస్తే మాత్రం దాన్ని ఆపలేమని అన్నారు. కేసీఆర్ తనకు సువ్వలు చూపెడితే తాను ఆయనకు చుక్కలు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు.  

టీఆర్ఎస్ పార్టీవి ఓ రాజకీయాలేనా అంటూ విమర్శించారు. ''నేను సిద్దిపేటకు పోలీసులు లేకుండా రాగలను కానీ హరీష్ నువ్వు అలా ఒంటరిగా సంగారెడ్డి వస్తావా...ఆ దైర్యం ఉందా'' అంటూ జగ్గారెడ్డి సవాల్ విసిరారు.  హరీష్‌ది ఓ బ్రతుకేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు లేకుండా తనముందు నిలబడాలంటూ టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. 

ఇక స్థానిక మాజీ ఎమ్మల్యే చింతా తన రాజకీయాలకు ఎప్పుడు అడ్డుకోలేడని అన్నారు. సంగారెడ్డి నీళ్లు దోచుకుంటుంటే చింతా చేతకాని వాడిలా మౌనంగా ఉన్నాడని  విమర్శించారు. ఈ సారి సంగారెడ్డి ప్రజలు తనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని జగ్గారెడ్డి కోరారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని అన్నారు. 

కేసీఆర్ ప్రకటించిన మేనిపెస్టోపై జగ్గారెడ్డి స్పందించారు. అది కేవలం మేనిపెస్టో మాత్రమేనని... అమలయ్యేది కాదని అన్నారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మైనారిటీ, గిరిజనులకు రిజర్వేషన్లు, లక్ష రుణమాపీ, లక్ష ఎకరాలకు సాగు నీరు ఏమయ్యాయని ప్రశ్నించారు. 

ఈ నాలుగేళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన మహాభారతంలో కౌరవ పాలన మాదిరిగా సాగిందని విమర్శించారు. కేసీఆర్ మరో దృతరాష్ట్రుడు, తెలంగాణ శిశుపాలుడు అంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశాడు. 

కాంగ్రెస్ అభ్యర్థిగా తాను గెలిచిన ఆరు నెలల్లో ప్రతి ఒక్కరికి హైదరాబాద్ ఐఐటీ సమీపంలో ప్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇలా మొత్తం 40వేల ప్లాట్లు పంచిపెడతానన్నారు. జగ్గారెడ్డి మాటంటే మాటని కార్యకర్తలు కూడా ఓటర్లకు చెప్పాలన్నారు. అక్కడ ఒక్క ప్లాటు ధర రూ.10 లక్షలు ఉందని...అయినా తాను వెనుకడుగు వేయననన్నారు. ఈ ప్లాట్ల పంపకం, మెడికల్ కాలేజీపై ఇప్పటికే ఉత్తమ్ నుండి హామీ తీసుకున్నానని జగ్గారెడ్డి తెలిపారు. 

తామంతా తల్లిలా భావించే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధిని బొమ్మ  అని కేటీఆర్ విమర్శించడాన్ని జగ్గారెడ్డి తప్పుబట్టారు. తాను కూడా కేటీఆర్ తల్లిని బొమ్మా అని అంటూ దూషిస్తే కేటీఆర్ తట్టుకోగలడా అని జగ్గారెడ్డి తీవ్ర పదజాలంతో దూషించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios