హైదరాబాద్: సేవ్ నల్లమల పేరుతో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయడంపై తమ పార్టీ నేతలపై పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బుధవారం శాసనసభ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకం్గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో పనిచేయాలని పీసీసి అధ్యక్షుడు, ఆయన నియమించిన యురేనియం వ్యతిరేక కమిటీ చైర్మన్ విహెచ్ సూచించారని, ఈ నేపథ్యంలో తాను వాళ్ల వెంట వెళ్లడంలో తప్పేముందని ఆయన అన్నారు. 

యురేనియంపై సంపత్ కుమార్ కు ఏబీసీడీలు కూడా తెలియవని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సమావేశానికి తాను ఎందుకు వెళ్లానని అడిగేవాళ్లు... వాళ్లు ఎందుకు వచ్చారో చెప్పాలని ఆయన సవాల్ చేశారు. పవన్ కల్యాణ్ సెల్ఫీ దిగేందుకు సంపత్ కుమార్ కు అవకాశం ఇవ్వలేదని, ఆ కోపాన్ని తనపై చూపిస్తే ఏం లాభమని ఆయన అన్నారు. 

ఎఐసిసి కార్యదర్శులుగా ఉండి, మహారాష్ట్రలో ఎన్నికలు వదిలిపెట్టి సంపత్, వంశీచందర్ రెడ్డిలకు ఈ సమావేశంలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఈ పోరాటంలో కలిసి వచ్చేవాళ్లు వస్తారు, రానివాళ్లు రారని ఆయన అన్నారు.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్ తో దోస్తీపై నిరసన: హీరోను చేయడమేమిటని ప్రశ్న

సేవ్ నల్లమల: తనవేమీ చిల్ల రాజకీయాలు కావన్న పవన్ కల్యాణ్

సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ ను తిప్పికొట్టిన కేసీఆర్ వ్యూహం

సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ పై మంత్రి శ్రీనివాస గౌడ్ కామెంట్

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్

యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: తేల్చేసిన కేటీఆర్

సేవ్ నల్లమల: రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొనే నేతలు వీరే...

సేవ్ నల్లమల: తాతపై హిమాన్షు ట్వీట్, బిజెపిపై కేసీఆర్ అస్త్రం అదే...