Asianet News TeluguAsianet News Telugu

ఇంటికి రేవంత్...తీవ్ర ఉద్రిక్తత : అరెస్టుకు రంగం సిద్దం?

ఇవాళ ఉదయం నుండి తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. ఆయనపై ఇవాళ ఉదయం నుండి ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇండ్లతో పాటు వారి బందువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తునన్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

revanth reddy reached his home
Author
Hyderabad, First Published Sep 27, 2018, 7:42 PM IST

ఇవాళ ఉదయం నుండి తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. ఆయనపై ఇవాళ ఉదయం నుండి ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇండ్లతో పాటు వారి బందువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తునన్నారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

అయితే ఈ కేసుల్లో రేవంత్ రెడ్డి ని అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే హైదరాబాద్ లోని రేవంత్ ఇంటివద్ద భారీ పోలీసులు మొహరించడంతో ఆ అనుమానం ఇంకా పెరిగిపోయింది. అంతేకాకుండా రేవంత్ కోస్గి సభలో బావోద్వేగంగా మాట్లాడుతూ... తాను జైలుకు వెళ్లినా అక్కడి నుండే నామినేషన్ వేస్తానన్నారు. దీంతో తనను అరెస్ట్ చేస్తారని రేవంత్ కు ముందుగానే సమాచారం అంది ఇలా మాట్లాడారా అన్న అనుమానం కలుగుతోంది.  

 కొద్దిసేపటి క్రితమే రేవంత్ హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అతడు వస్తున్నాడని ముందే సమాచారం ఉండటంతో కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. రేవంత్ రాగానే ఆయన చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఆ తర్వాత రేవంత్, ఆయన భార్య మాత్రమే ఇంట్లోకి వెళ్లారు. మిగతా ఎవరినీ పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. 

రేవంత్ ఇంటిచుట్టూ పోలీసులు ఇప్పటికే భారీకేడ్లు ఏర్పాటు చేశారు. కార్యకర్తలను, అభిమానులను అదుపు చేస్తున్నారు. ఇలా రేవంత్ ఇంటివద్ద గంభీర వాతావవణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అటు రాజకీయ నాయకుల్లో ఇటు ప్రజలు ఉత్కంట నెలకొంది. 

సంబంధిత వార్తలు

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

ఓవైపు ఐటి దాడులు జరుగుతుంటే డోలు వాయిస్తూ రేవంత్ జోష్ (వీడియో)

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

ఒకవైపు ఐటీ దాడులు.. మరోవైపు రేవంత్ ఏం చేస్తున్నాడంటే

రేవంత్‌పై ఐటీ దాడులు...ఆరు నెలల నుంచి అకౌంట్‌లోకి కోట్ల రూపాయలు..?

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios