కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఒక్కసారిగా రాజకీయం హీట్ ఎక్కింది. కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఇది కేసీఆర్ పనేనని పలువురు విమర్శిస్తున్నారు.

అయితే ఇదంతా ఏమీ పట్టని రేవంత్.. గురువారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం మదన్ పల్లి నుంచి ఆయన ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. ఒకవైపు ఐటీ దాడులు కొనసాగుతున్నా.. ఆ ఆందోళన ఏమాత్రం కనిపించకుండా తన ప్రచారాన్ని కొనసాగించడం విశేషం. మదనపల్లి, బురాన్ పూర్, బొంరాస్ పేట మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కొస్గి మండలం పోలేపల్లికి రేవంత్ ప్రచారం చేరుకోనున్నట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు