Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌పై ఐటీ దాడులు...ఆరు నెలల నుంచి అకౌంట్‌లోకి కోట్ల రూపాయలు..?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడుల వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఓటుకు నోటు కేసులో భాగంగానే ఐటీ దాడులు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.

IT officials focus on Revanth reddy bank transactions
Author
Hyderabad, First Published Sep 27, 2018, 10:52 AM IST

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడుల వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఓటుకు నోటు కేసులో భాగంగానే ఐటీ దాడులు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.

నాడు నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్‌తో రేవంత్ రెడ్డి రాయబారం నడిపిన సమయంలో దొరికిన రూ.50 లక్షల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అయితే ఇంతవరకు అందుకు తగిన ఆధారాలను కనిపెట్టేలేకపోయింది..

దీనిపై ఏసీబీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేయగా.. వారు రేవంత్ రెడ్డి బ్యాంక్ ఖాతాలపై గత ఆరు నెలల నుంచి నిఘా పెట్టి... సోదాలకు దిగినట్లుగా తెలుస్తోంది. ఆరు నెలల సమయంలో ఆయన బ్యాంక్‌ ఖాతాల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరగుతుండటం, విదేశాల నుంచి కోట్లాది రూపాయలు జమ అవుతుండటంపై పక్కా ఆధారాలు సంపాదించిన ఎన్‌ఫోర్స్‌మెంట్  అధికారులు.. ఆ లెక్కలు తెలుసుకునేందుకే ఇవాళ సోదాలు నిర్వహించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

రెండు వారాల క్రితం రేవంత్ రెడ్డి సోదరుడికి చెందిన ఓ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి కూడా విదేశాల నుంచి భారీగా నిధులు రావడంతో.. ఐటీ నోటీసులు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ నుంచి కానీ, అతని సోదరుడి నుంచి కానీ ఎలాంటి సమాధానం రాకపోవడం కూడా దాడులకు కారణమైంది.

ఐటీ దాడులు ముందే ఊహించిన రేవంత్.. అందుకే..?

రేవంత్‌పై ఐటీదాడులు.. ఓడిపోతానేమోనని కేసీఆర్‌కు భయం: ఉత్తమ్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

Follow Us:
Download App:
  • android
  • ios