Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడుల వెనుక ఆయనే...

రేవంత్ రెడ్డిపై కొన్ని రోజుల క్రితం రామారావు సిబిఐకి ఫిర్యాదు చేశారు. రేవంత్‌ రెడ్డి బంధువు జయప్రకాశ్‌ తదితరులు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు

Lawyer behind the IT raids on Revanth Reddy's houses
Author
Hyderabad, First Published Sep 27, 2018, 11:48 AM IST

హైదరాబాద్: కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు జరగడం వెనక ఓ న్యాయవాది ఉన్నట్లు తెలుస్తోంది.  రామారావు అనే న్యాయవాది ఈ ఐటి దాడులకు కారణమని అంటున్నారు. రేవంత్ రెడ్డిపై కొన్ని రోజుల క్రితం రామారావు సిబిఐకి ఫిర్యాదు చేశారు. 

రేవంత్‌ రెడ్డి బంధువు జయప్రకాశ్‌ తదితరులు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. సాయిమౌర్య ఎస్టేట్‌ అండ్ ప్రాజెక్ట్‌ లిమిటెడ్స్‌ తరపున. 10 నుంచి 15 డొల్ల కంపెనీలకు 300 కోట్ల రూపాయలకు పైగా నిధులు మళ్లించారని రామారావు ఆరోపణ చేసినట్లు తెలుస్తోంది.

రేవంత్‌రెడ్డికి సంబంధించిన డొల్ల కంపెనీల చిరునామా రేవంత్ రెడ్డిదే ఉందని, ఆ ఇఇంటి నెంబర్‌-346 అని, ఆ ఇల్లు జూబ్లీహిల్స్‌ లో ఉందని చెబుతూ ఆ ఇంటి చిరునామాను రామారావు సిబిఐకి తన ఫిర్యాదులో ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ ఫిర్యాదును ఐటీ, ఈడీలకు సీబీఐ రెఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే రేవంత్ రెడ్డి ఇళ్లపై, ఆయన బంధువుల ఇళ్లపై సోదాలు జరిగాయనే వాదన వినిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios