తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన రెండు ఐటీ బృందాలు హైదరాబాద్‌, కొడంగల్‌లోని ఆయన ఇళ్లతో పాటు, రేవంత్ రెడ్డి వ్యాపార కార్యాలయం, సన్నిహితులు, బంధువుల నివాసాలు మొత్తం 15 చోట్ల తనిఖీలు నిర్వహించాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొడంగల్‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఆయన కుటుంబసభ్యులు తిరుపతిలో ఉన్నారు.