యాదాద్రి సెక్స్ రాకెట్.... చిన్నారులపై ఎదుగుదల హార్మోన్లను ఉపయోగించి వ్యభిచారం చేయిస్తూ....

rachakonda dcp press meet on yadadri operation muskan
Highlights

యాదగిరి గుట్టలో ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతోంది. చిన్నారులను కిడ్నాప్ చేసి వ్యభిచార గృహాల్లో బంధిస్తున్నట్లు గుర్తించిన ఎస్‌వోటి, స్థానిక పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. గత రెండు రోజులుగా వ్యవధిలో దాదాపు 15 మంది చిన్నారులను వ్యభిచార నిర్వహకుల నుండి కాపాడిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి చిల్డ్రన్ హోం కు తరలించారు.

గురువారం రెండో రోజు కొనసాగిన దాడుల్లో నలుగురు చిన్నారులను కాపాడినట్లు రాజకొండ డిసిపి రాంచంద్రారెడ్డి తెలిపారు. బాలికల్ని కిడ్నాప్ చేసి, వ్యభిచారం కోసం తయారుచేస్తున్న ఆరుగురు నిర్వహకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నిందితులు నాగలక్ష్మి, కంసాని నరేష్, స్వప్న,  కంసాని కుమార్,కంసాని రజని, కంసాని ఎల్లయ్యలపై పీడి యాక్టు నమోదు చేయనున్నట్లు డిసిపి తెలిపారు. అలాగే వీరి ఇళ్లను కూడా 133 సెక్షన్ కింద సీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఇక వీరికి సహకరిస్తున్న ఓ ఆర్ఎంపీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనురాధ నర్సింగ్ హోం లో సోదాలు నిర్వహించిన ఎస్‌వోటి పోలీసులు, చిన్నారుల ఎదుగుదల కోసం ఉపయోగించే 48 ఆక్సిటోసిన్ ఇంజక్షన్లతో పాటు శాంపిల్ మెడిసిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్పత్రి నిర్వహకుడైన ఆర్ఎంపి డాక్టర్ నర్సింహను కుడా అరెస్ట్ చేశారు.

ఈ చిన్నారుల్లో ఎవరైనా తమ పిల్లలు ఉన్నట్లు గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని డిసిపి సూచించారు. డీఎన్ఎ పరీక్ష నిర్వహించిన తర్వాతే చిన్నారులను తల్లిదండ్రులకు అపప్పగించనున్నట్లు తెలిపారు.

loader