Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ శివారులో ఆన్లైన్ వ్యభిచారం... గుట్టురట్టు చేసిన పోలీసులు

హైదరాబాద్ శివారులో హైటెక్ పద్దతిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేసి బంగ్లాదేశీ మహిళను కాపాడారు. 

Prostitution racket busted in Hyderabad outskirts
Author
Hyderabad, First Published Nov 9, 2021, 12:38 PM IST

హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని కీసరలో గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆన్లైన్ ద్వారా అమ్మాయిల ఫోటోలను విటులకు పంపి డబ్బులను కూడా అదే పద్దతితో వసూలు చేసి అమ్మాయిలను వారివద్దకు పంపిస్తున్నారు. ఇలా ఎలాంటి వ్యభిచార గృహాన్ని నిర్వహించకుండానే హెటెక్ పద్దతిలో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ ముఠా గుట్టును రట్టు చేసారు. 

వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కుమారస్వామి(49) ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లోని ఈసిఐఎల్ లో నివాసముంటున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలని భావించిన అతడు అందుకోసం గలీజ్ దందాను ఎంచుకున్నాడు. తన చేతికి మట్టి అంటకుండా హైటెక్ పద్దతిలో వ్యభిచారాన్ని నిర్వహించసాగాడు. 

టీకొట్టు నడిపించుకునే అరుణకుమారి అనే మహిళతో కుమారస్వామికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి గతంలో మేడిపల్లి పరిధిలో prostitution business నిర్వహిస్తూ పట్టుబబడటంతో కేసు నమోదయ్యింది.. దీంతో పోలీసుల నిఘా వుండటంతో తమ దందాను వీరు కీసరకు మార్చారు.  

మహిళలు, యువతుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. వీరి ఫోటోలను వాట్సాప్ తో వాటు వివిధ మాధ్యమాల ద్వారా విటులకు పంపించి ఆకర్షించేవారు. ఎవరయినా ఆకర్షితులైతే వారి వద్ద ఆన్లైన్ ద్వారానే డబ్బులు తీసుకుని కోరిన చోటకు అమ్మాయిలను పంపించేవారు. 

read more  న్యూడిల్లీలో హైటెక్ వ్యభిచారం... వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలతో సహా రేట్ కార్డు

ఇలా ఎలాంటి వ్యభిచార గృహం లేకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యభిచార దందాను నిర్వహిస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళను కలకత్తానుండి తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.

అయితే వీరి వ్యభిచార దందాపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో నిర్వహకులు కుమారస్వామి, అరుణకుమారిపై నిఘాపెట్టారు. దీంతో వారు బంగ్లాదేశీ మహిళను బోడుప్పల్ కు చెందిన ఓ విటుడి వద్దకు పంపించడానికి బేరం కుదిరినట్లు తెలిసింది. దీంతో బంగ్లాదేశీ మహిళతో పాటు ఇద్దరు నిర్వహకులను అరెస్ట్ చేసారు. వారివద్ద నుండి రెండు సెల్ ఫోన్లు, ఓ కారు, నాలుగువేల రూపాయలను స్వాధీనం  చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే ఎంతో పవిత్రంగా వుంటూ పూజలు చేయాల్సిన ఓ పూజారి ఈజీ మనీ కోసం గలీజ్ దందా చేస్తున్న ఘటన నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. కట్టుకున్న భార్యతో కలిసి ఏకంగా ఓ వ్యభిచార గృహాన్నే నిర్వహిస్తున్న సదరు పూజారిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసారు.   

read more  హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇద్దరు మహిళలు

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో రమేష్ చారి పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే ఇలా పూజలు చేసి పవిత్రమైన సంపాదనను కాదని గలీజ్ దందాలోకి దిగాడు. నల్గొండ పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని brothel house ని నిర్వహిస్తున్నాడు. కట్టుకున్న భార్యతో కలిసే రమేష్ చారి వ్యభిచార దందా ప్రారంభించాడు. ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరికొందరు మహిళలతో వ్యభిచారం  

అయితే ఈ వ్యభిచార గృహంపై నల్గొండ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ఇంటిపై నిఘాపెట్టిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. దీంతో ఆదివారం రాత్రి ఆ ఇంటిపై దాడిచేసి ఐదుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios