లైంగిక ఆరోపణలు:డీఎస్ తనయుడు సంజయ్‌పై నిర్భయ కేసు

Nizamabad police files nirbhaya case against Sanjay
Highlights

డీఎస్ తనయుడు సంజయ్‌పై  శుక్రవారం నాడు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు సంజయ్‌పై లైంగిక ఆరోపణలు చేయడంతో  సంజయ్‌పై నిజామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

నిజామాబాద్: డీఎస్ తనయుడు సంజయ్‌పై  శుక్రవారం నాడు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు సంజయ్‌పై లైంగిక ఆరోపణలు చేయడంతో  సంజయ్‌పై నిజామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శాంకరీ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదివే విద్యార్థినులు  సంజయ్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. పీఓడబ్ల్యూ నేత సంధ్య నేతృత్వంలో విద్యార్థినులు గురువారంనాడు సచివాలయంలో హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు.

బాధితులకు అండగా ఉంటామని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే నిజామాబాద్  సీపీని కలిసి ఫిర్యాదు చేయాలని హోం మంత్రి విద్యార్థినులకు సూచించారు.

హోంమంత్రి సూచన మేరకు విద్యార్థినులు శుక్రవారం నాడు మధ్యాహ్నం  నిజామాబాద్ సీపీ కార్తికేయను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  సంజయ్ పై  ఇవాళ నిజామాబాద్ పోలీసులు  సంజయ్ పై నిర్భయ కేసు నమోదు చేశారు.

శాంకరీ కాలేజీకి చెందిన నర్సింగ్ విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలను సంజయ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా  తనను ఇబ్బందిపెట్టే ఉద్దేశ్యంతోనే  ఈ ఆరోపణలు చేస్తున్నారని సంజయ్ చెప్పారు. 

గత మాసంలో  డీఎస్ పై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా డీఎస్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరుణంలో  సంజయ్‌పై ఆరోపణలు రావడం.. కేసు నమోదు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ వార్తలు చదవండి:సోదరుడు సంజయ్‌పై లైంగిక ఆరోపణలు: ట్విస్టిచ్చిన అరవింద్

సంజయ్‌పై లైంగిక ఆరోపణలు: నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు

నాపై కుట్ర చేశారు: లైంగిక వేధింపుల ఆరోపణలపై సంజయ్

డీఎస్‌కు ఎదురుదెబ్బ: తనయుడిపై లైంగిక ఆరోపణలు

 

loader