నాపై కుట్ర చేశారు: లైంగిక వేధింపుల ఆరోపణలపై సంజయ్

No realtionship with nursing students says d.sanjay
Highlights

నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా తాను వేధింపులకు గురిచేసినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీ.శ్రీనివాస్ తనయుడు  డీ.సంజయ్ వివరణ ఇచ్చారు.  తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 

నిజామాబాద్: నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా తాను వేధింపులకు గురిచేసినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీ.శ్రీనివాస్ తనయుడు  డీ.సంజయ్ వివరణ ఇచ్చారు.  తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 

శాంకరీ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర హోంశాఖ మంత్రిని గురువారం సాయంత్రం సచివాలయంలో కలిసి  తమను లైంగికంగా  డీఎస్ తనయుడు డీ.సంజయ్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణల నేపథ్యంలో  శుక్రవారం నాడు  సంజయ్ వివరణ ఇచ్చారు.

తాను నర్సింగ్‌ విద్యార్ధినులతో సహజీవనం చేసినట్టు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే నర్సింగ్ కాలేజీ విద్యార్థినులతో  తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని సంజయ్ చెప్పారు.

పోలీసుల విచారణకు సహకరిస్తానని ఆయన చెప్పారు. నర్సింగ్ విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే  ఈ ఆరోపణలు చేశారని ఆయన చెప్పారు. 

ఈ వార్త చదవండి:డీఎస్‌కు ఎదురుదెబ్బ: తనయుడిపై లైంగిక ఆరోపణలు

 

loader