సోదరుడు సంజయ్‌పై లైంగిక ఆరోపణలు: ట్విస్టిచ్చిన అరవింద్

Dharamapuri Aravind reacts on sexual harassments on Sajay
Highlights

తన సోదరుడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై  బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. సంజయ్‌పై వచ్చిన ఆరోపణలు టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంగా  అరవింద్ అభిప్రాయపడ్డారు

నిజామాబాద్:తన సోదరుడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై  బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. సంజయ్‌పై వచ్చిన ఆరోపణలు టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంగా  అరవింద్ అభిప్రాయపడ్డారు.ఈ ఆరోపణల వల్ల తనకు  రాజకీయంగా ఎలాంటి నష్టం ఉంటుందని తాను భావించడం లేదన్నారు. 

డీఎస్ తనయుడు  అరవింద్ బీజేపీలో చేరారు. మరో తనయుడు  సంజయ్ మాత్రం డీఎస్‌తో పాటే టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. తాజాగా సంజయ్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో  అరవింద్ స్పందించారు. 

తాము విడిపోయి  సుమారు 20 ఏళ్లు దాటిందని అరవింద్ చెప్పారు. సంజయ్‌పై వచ్చిన ఆరోపణలు తనకు రాజకీయంగా నష్టం చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు.  ఈ వ్యవహరం టీఆర్ఎస్ అంతర్గత విషయంగా ఆయన అభిప్రాయపడ్డారు. 

టీఆర్ఎస్ అంతర్గత వ్యవహరమైనందున తనకు నష్టం లేదన్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ  రైతులు ఆందోళన చేస్తున్నా  ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. 

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీరందించాలని ఆయన డిమాండ్ చేశారు.  టీఆర్ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆయన  విమర్శలు గుప్పించారు.  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. 

ఈ వార్తలు చదవండి: సంజయ్‌పై లైంగిక ఆరోపణలు: నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు

                                   నాపై కుట్ర చేశారు: లైంగిక వేధింపుల ఆరోపణలపై సంజయ్

                                    డీఎస్‌కు ఎదురుదెబ్బ: తనయుడిపై లైంగిక ఆరోపణలు


 

loader