సంజయ్‌పై లైంగిక ఆరోపణలు: నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు

Nursing college students complaint against DR.Sanjay to Nizamabad CP
Highlights

 శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు శుక్రవారం నాడు నిజామాబాద్ పోలీసు కమిషనర్‌ను కలిసి  తమపై  డీఎస్ తనయుడు  సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు

నిజామాబాద్: శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు శుక్రవారం నాడు నిజామాబాద్ పోలీసు కమిషనర్‌ను కలిసి  తమపై  డీఎస్ తనయుడు  సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు.  ఈ విషయమై గురువారం నాడు  రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని బాధితులు కలిసి ఫిర్యాదు చేశారు.హోం మంత్రి సూచన మేరకు బాధిత విద్యార్థినులు శుక్రవారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్  కార్తికేయను కలిసి  ఫిర్యాదు చేశారు.

శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన 11 మంది విద్యార్ధినులు తమపై  డీఎస్ తనయుడు సంజయ్  లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పీఓడబ్ల్యూ నేత సంధ్య నేతృత్వంలో హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి సూచన మేరకు  బాధితులు  ఇవాళ ఉదయం  నిజామాబాద్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

సంజయ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై ఫిర్యాదులు చేస్తే తీవ్ర పరిణామాలు కూడ ఉంటాయని కూడ బెదిరించారని బాధిత కుటుంబసభ్యులు మీడియాకు చెప్పారు.  తాము ఇంతకాలం పాటు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడ  బాధితులు  పోలీస్ కమిషనర్ కు వివరించారు.

ఇదిలా ఉంటే ఈ ఆరోపణలను డీఎస్ తనయుడు సంజయ్ కొట్టిపారేశారు.ఈ ఆరోపణల్లో వాస్తవం లేవన్నారు. రాజకీయంగా  తనను ఇబ్బందిపెట్టేందుకే  తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంజయ్ చెప్పారు. 

ఈ వార్తలు చదవండి:డీఎస్‌కు ఎదురుదెబ్బ: తనయుడిపై లైంగిక ఆరోపణలు

                                 నాపై కుట్ర చేశారు: లైంగిక వేధింపుల ఆరోపణలపై సంజయ్

 

loader