నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉదయం నుంచి హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. నకిరేకల్ పట్టణం అంతటా కలియతిరుగుతూ ఆయన హోళీ పండుగ జరుపుకున్నారు. తన మిత్రులు, సహచరులు, అభిమానులతో పెద్ద ర్యాలీగా తిరుగుతూ వేడుకల్లో పాల్గొన్నారు. పనిలో పనిగా స్థానిక పోలీసులకు కూడా హోళీ రంగులు రుద్ది అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే వీరేశం. ఎమ్మెల్యే హోళీ వేడుకలు జరుపుకున్న వీడియో కింద చూడొచ్చు.