హోలీ
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో హోలీ ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంగుల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతాయి. రంగులు, బెలూన్లు, కోడి గుడ్లు, టమాటాలు వంటివి ఉపయోగించి హోలీని మరింత ఉల్లాసంగా జరుపుకుంటారు. ప్రాంతాన్ని బట్టి హోలీ పండుగను జరుపుకునే విధానంలో వైవిధ్యం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు, మరికొన్ని చోట్ల రెండు రోజులు హోలీ సంబరాలు కొనసాగుతాయి. హోలీ పండుగను కేవలం భారతదేశంలోనే కాదు, హిందూ సనాతన సంప్రదాయాన్ని పాటించే వారు ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో, ప్రత్యేక పేర్లతో జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పూలతో హోలీ ఆడుతారు, మరికొన్ని చోట్ల రంగులు, గులాల్లతో సందడి చేస్తారు. కొన్ని చోట్ల ధైర్యం, పరాక్రమం ప్రదర్శించే విధంగా హోలీని జరుపుకుంటారు. రంగుల ఈ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఆనందంగా నిర్వహిస్తారు.
Read More
- All
- 20 NEWS
- 11 PHOTOS
- 1 WEBSTORIES
32 Stories