కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లిలో మైనర్ బాలికపై ఐదుగురు యుకులు అత్యాచారానికి పాల్పడ్డారు.మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దుండగులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. అంతేకాదు ఈ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

ఈ విషయం బాలిక కుటుంబ సభ్యుల దృష్టికి వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు యువకులు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

మైనర్ బాలికకు వీరికి ఎలా పరిచయం.. బాలికను ఎక్కడికి తీసుకెళ్లారు..వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా.. ఈ ఒక్క ఘటనలోనే వీరి ప్రమేయం ఉందా ఇంకా ఈ తరహా ఘటనల్లో వవీరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం పోలీసులను కోరుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తుున్నారు.