Asianet News TeluguAsianet News Telugu

ద‌ళిత మ‌హిళ‌పై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆగ్ర‌హం.. త‌మ‌కు ఇష్టమైనోళ్ల‌కే ద‌ళితబంధు ఇస్తామ‌ని వ్యాఖ్య‌లు

తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓ దళిత మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకంపై ప్రశ్నించినందుకు ఆమెను ఓ సమావేశం నుంచి బయటకు వెళ్లాలని చెప్పారు.

Minister Indrakaran Reddy's anger on Dalit women.. Comments that they will give Dalita Bandhu only to their favorite women
Author
First Published Sep 28, 2022, 10:24 AM IST

త‌మ‌కు ఇష్ట‌మైన వారికే ద‌ళిత బంధు ఇస్తామ‌ని మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. ఓ ద‌ళిత మ‌హిళ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆమెను ప‌క్క‌కి తీసుకెళ్లాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఆయ‌న ఇలా రియాక్ట్ అయ్యారు. ఆయ‌న కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థల దూకుడు.. సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన ఈడీ

నిర్మ‌ల్ జిల్లాలోని న‌ర్సాపూర్ గ్రామంలో సోమ‌వారం రాత్రి బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ కార్య‌క్రమం ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. మ‌హిళ‌ల‌కు చీర‌లు అంద‌జేసి, మంత్రి మాట్లాడుతున్న స‌మ‌యంలో ఓ ద‌ళిత మ‌హిళ లేచి క‌లుగ‌జేసుకున్నారు. త‌మ‌కు ద‌ళిత‌బంధు రాలేదని, పేద‌వాళ్ల‌కు ఆ ప‌థ‌కం చేర‌డం లేదంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదేంట‌ని మంత్రిని ప్ర‌శ్నించారు.

మంచాలలో అర్దరాత్రి యువతీ, యువకుల హంగామా.. మద్యం తాగుతూ, స్విమ్మింగ్ చేస్తూ రచ్చ.. చివరకు పోలీసుల ఎంట్రీతో..

ఆమె వ్యాఖ్య‌ల‌పై మంత్రికి కోపం వ‌చ్చింది. ఆ మ‌హిళ‌పై తీవ్రంగా ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ.. త‌మ‌కు ఇష్ట‌మైన వాళ్ల‌కు ద‌ళిత బంధు ప‌థ‌కం ఇస్తామ‌ని అన్నారు. అలా ఎందుకు మాట్లాడుతున్నార‌ని తెలిపారు. ఈ స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచించారు. అనంత‌రం ఆ మ‌హిళ‌ల‌ను అక్క‌డి నుంచి తీసుకెళ్లాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. 

కారణమిదీ: హెచ్ సీ ఏ పై మరో కేసు

బీజేపీ వాళ్ల‌తో తిరిగే వారు, ఆ నాయ‌కుల‌నే ద‌ళిత బంధు అడ‌గాల‌ని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు విడ‌త‌ల్లో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామని అన్నారు. తొంద‌ర‌లోనే అర్హులైన అంద‌రికీ ఆ ప‌థ‌కాన్ని అందిస్తామ‌ని చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు కొంచెం ఓపిక ప‌ట్టాల‌ని తెలిపారు.

ప్రశాంతంగా జరిగే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వరు?.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

అయితే మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నాయ‌కులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం పొద్ద‌నా గ్రామంలో ఉన్న అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఎదుట నోటికి న‌ల్ల గుడ్డ‌లు పెట్టుకుని నిర‌స‌న తెలియ‌జేశారు. మంత్రి వ్యాఖ్య‌లు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని వాట్సాప్ గ్రూపుల్లో, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios