Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థల దూకుడు.. సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఈ కేసులో తాజాగా మరొకరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 

Delhi excise policy case ED arrests liquor trader Sameer Mahendru
Author
First Published Sep 28, 2022, 10:08 AM IST

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఈ కేసులో తాజాగా మరొకరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రును ఈడీ బుధవారం ఉదయం అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

మహేంద్రు.. ఇండో స్పిరిట్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రాత్రంతా విచారణ జరిపిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్‌ను సీబీఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేసింది. ఈ కేసులో సీబీఐ చేసిన తొలి అరెస్ట్ ఇది. విజయ్ నాయర్.. ఓన్లీ మచ్ లౌడర్ అనే ఎంటర్‌టైన్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌కు గతంలో సీఈవోకు పనిచేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నాయర్ ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే లండన్‌ వెళ్లిన ఆయన.. సీబీఐ విచారణ కోసం తిరిగి వచ్చాడు. విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు.. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. 

2021-22 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో విజయ్ నాయర్ అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ అని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. ఆప్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పార్టీ నాయకులకు సహాయం చేసారని, వారి సోషల్ మీడియా హ్యాండిల్‌లను కూడా నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. విజయ్ నాయర్ తరపున.. ఇండోస్పిరిట్స్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహచరుడు అర్జున్ పాండేకు సుమారు రూ. 2-4 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

హైదరాబాద్‌లోని కోకాపేట్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై.. నాయర్ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగులకు నగదు బదిలీ కోసం మహేంద్రు నుంచి అనవసరమైన డబ్బును వసూలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios