Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంతంగా జరిగే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వరు?.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

గాంధీ జయంతి నాడు ఆర్ఎస్ఎస్ తలపెట్టిన ర్యాలికి అనుమతి ఎందుకు ఇవ్వరంటూ ప్రభుత్వాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు. ప్రశాంతంగా జరిగే ర్యాలీలపై నిషేధం అవసరం లేదన్నారు. 

Why not give permission for RSS rally? asks Governor Tamilisai Soundararajan
Author
First Published Sep 28, 2022, 9:00 AM IST

చెన్నై : గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఆర్ఎస్ఎస్ తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వరని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు.  చెన్నైలో మంగళవారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ఆ సంస్థ నిర్వహించే ర్యాలీలు ప్రశాంతంగానే జరుగుతాయన్నారు. గతంలో తాను కూడా ఆర్ఎస్ఎస్ లో సేవలందించానని చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ శాంతియుతంగా, ప్రశాంతంగా జరుప తలపెట్టిన ర్యాలీపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని,  ర్యాలీకి అనుమతి ఇవ్వడమే సమంజసంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

గాంధీ జయంతి రోజు ఎలా ర్యాలీ నిర్వహిస్తారు అంటూ కొందరు ప్రశ్నించడం కూడా విడ్డూరంగా ఉంది అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పెట్రోల్ బాంబుదాడులపై స్పందిస్తూ తమిళనాట  బాంబుల సంస్కృతికి ఎన్నడూ తావులేదని, ఏ రాష్ట్రంలోనూ బాంబుల సంస్కృతిని ప్రోత్సహించకూడదు అని వ్యాఖ్యానించారు.  మత సామరస్యం నెలకొల్పే విషయంలో రాజీకి తావులేదన్నారు.  ప్రభుత్వం అన్ని మతాలవారికి భద్రత కల్పించి  నిష్పక్షపాతంగా  వ్యవహరించాలని ఆమె సూచించారు. 

ముగిసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణ... 8 గంటల పాటు ప్రశ్నల వర్షం

ర్యాలీకి వ్యతిరేకంగా డీపీఐ అప్పీలు…
అక్టోబర్ 2న ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీకే ఇలందిరియన్‌ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డిపిఐ నేత తొల్ తిరుమావళవన్ అప్పీల్ చేశారు. మొదట సోమవారం ఉదయం ఆయన సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ పిటిషన్ వేశారు. దానిని అత్యవసర కేసుగా పరిగణించి విచారణ జరపాలని కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి ఇలందిరియన్‌ ర్యాలీ కేసుతో తిరుమావళవన్ కు ఎలాంటి సంబంధం లేనప్పుడు  తానెలా విచారణ జరుపుతామని ప్రశ్నించారు. అంతేకాక తాను ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లవచ్చని సూచించారు. ఆ మేరకు తిరుమావళవన్ అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డి.రాజా, న్యాయమూర్తి కృష్ణకుమార్ విచారణ జరపనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios