మతిస్థిమితం లేని వివాహితపై ఇద్దరు గ్యాంగ్ రేప్

Mentally disabled woman gang raped in Khammam district
Highlights

మతిస్థిమితం లేని ఓ వివాహితపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఖమ్మం: మతిస్థిమితం లేని ఓ వివాహితపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్లలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్ిచంది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ... తనికెళ్లకు చెందిన ఓ మహిళ (25)కు చిన్నప్పటి నుంచి మతిస్థిమితం లేదు. ఈమెరు ఆరేళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం భర్త వదిలేశాడు.

మార్చి 9వ తేదీిన ఆమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆ వీధిలోనే ఉండే బంటు యల్లారావు అనే యువకుడదు మాయ మాటలు చెప్పి ఇంట్లోకి పిలిచి నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు మేకల రామకృష్ణ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు.

మరోసారి ఏప్రిల్ 17వ తేదీన ఆ మహిళ మెడికల్ షాపునకు వెల్లి వస్తుండగా తనికెళ్ల సెంటర్ లో యల్లారావు ఆమెను లారీ కిందికి తోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, తలకు గాయమై ప్రాణాలతో బయటపడింది. అతనే చికిత్స చేయించి ఇంటి వద్ద వదిలేశాడు. తల్లి గట్టిగా అడగడంతో విషయాన్ని ఆమె చెప్పింది.

తల్లి సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.

loader