Asianet News TeluguAsianet News Telugu

Hyderabad: నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్... వివాహితపై లాయర్ అత్యాచారం

న్యాయం కోసం ఆశ్రయించిన వివాహితపై కన్నేసాడు ఓ లాయర్. నగ్న వీడియోలతో ఆమెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకున్న సదరు లాయర్ పాపం పండటంతో కాస్త ఆలస్యమైనా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

married Woman client raped by Lawyer in Hyderabad
Author
Hyderabad, First Published Jan 23, 2022, 10:17 AM IST

హైదరాబాద్:  న్యాయం కావాలంటూ ఆశ్రయించిన ఓ వివాహితపై కన్నేసాడో కామాంధుడు. మహిళ నివాసంలో రహస్యంగా సిసి కెమెరాలు పెట్టి నగ్నంగా వున్న వీడియోలను సంపాదించాడు. వాటిని అడ్డుపెట్టుకుని మహిళను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అయితే అతడి ఆగడాలు మరీ మితిమీరిపోవడంతో తట్టుకోలేకపోయిన వివాహిత పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.  

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ (hyderabad) లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఓ సాధారణ మద్యతరగతి యువతి(25) పనిచేస్తోంది. అయితే ఆమెకు వివాహమవగా భర్తతో మనస్పర్ధల కారణంగా విడిపోడానికి నిర్ణయించుకుంది. భర్తకు దూరంగా వుంటున్న ఆమె గతేడాది జూన్ లో విడాకుల కోసం ఓ లాయర్ ను ఆశ్రయించింది.  

తాను భర్తతో విడిపోయి ఒంటరిగా వుంటున్నానని... భర్తతో విడాకులు ఇప్పించాలని సదరు లాయర్ ని కోరింది. అయితే వివాహిత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను ఎలాగయినా అనుభవించాలని లాయర్ కు నీచమైన ఆలోచన వచ్చింది. దీంతో తన క్లయింట్ అయిన వివాహితను లోబర్చుకునేందుకు కుట్ర పన్నాడు.

భర్తకు దూరంగా వుంటున్న తాను ఇంటికి మార్చాలని నిర్ణయించుకున్నట్లు యువతి లాయర్ కు తెలిపింది. దీంతో తన నివాసానికి సమీపంలో ఓ అపార్ట్ మెంట్ లో ప్లాట్ ఖాళీగా వుందని లాయర్ ఆమెకు తెలిపాడు. అందులో అద్దెకు దిగేందుకు సదరు యువతి సమ్మతించగా తన వంకర బుద్దికి పనిచెప్పాడు లాయర్.  

యువతి అద్దెకు దిగడానికి ముందే ఆ ఫ్లాట్ లో రహస్యంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయించాడు. ఈ క్రమంలోనే బాధితురాలు దుస్తులు మార్చుకుంటూ నగ్నంగా వున్న వీడియోలను సంపాదించాడు. కొంతకాలంపాటు ఇలా  ఆమె వీడియోలను సేకరించిన తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

వీడియోలను చూపించి వివాహితను బెదిరించిన సదరు లాయర్ తన వాంఛ తీర్చాలని కోరాడు. ఎంత ప్రాదేయపడినా వదిలిపెట్టకుండా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి యువతిని పలుమార్లు అనుభవించాడు.

అయితే ఇటీవల అతడి చేష్టలు మరీ మితిమీరిపోవడంతో భరించలేకపోయిన యువతి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. తనను బెదిరించి లాయర్ లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందించడంతో రంగంలోకి దిగిన మల్కాజ్ గిరి పోలీసులు సదరు లాయర్ పై కేసు నమోదు చేసారు. యువతిని వైధ్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించామని... కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios