Asianet News TeluguAsianet News Telugu

మిగిలిన ఎంపీలు కూడా వచ్చేస్తారు: విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్య

టీఆర్ఎస్ పాలనపై తాము కళ్లు తెరవడానికి మూడున్నరేళ్లు పట్టిందని, టీఆర్‌ఎస్‌లో దేనిపైనా చర్చ జరగదని, ఒక్కరే నిర్ణయిస్తారని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. బడ్జెట్ ఏమిటో ఆర్థిక మంత్రికి కూడా తెలియదని, పేపర్లలో వచ్చే వరకు పోలీస్‌ బదిలీల గురించి హోంమంత్రికి కూడా తెలియదని అన్నారు. 

Konda Vishweshwar Reddy on two TRS MPs
Author
Hyderabad, First Published Nov 25, 2018, 11:26 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యులు కె. కేశవరావు, జితేందర్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారని ఇటీవల కాంగ్రెసులో చేరిన పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై ఆయన ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగిలిన ఎంపీలు కూడా టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వస్తారు. టీఆర్‌ఎస్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని జితేందర్‌రెడ్డి చాలా సార్లు అన్నట్లు ఆయన తెలిపారు.

టీఆర్ఎస్ పాలనపై తాము కళ్లు తెరవడానికి మూడున్నరేళ్లు పట్టిందని, టీఆర్‌ఎస్‌లో దేనిపైనా చర్చ జరగదని, ఒక్కరే నిర్ణయిస్తారని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. బడ్జెట్ ఏమిటో ఆర్థిక మంత్రికి కూడా తెలియదని, పేపర్లలో వచ్చే వరకు పోలీస్‌ బదిలీల గురించి హోంమంత్రికి కూడా తెలియదని అన్నారు. 

ఎంపీలందరూ కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగితే.. మీ సీఎం కనీసం దరఖాస్తు కూడా చేయలేదని కేంద్రం చెప్పిందని, ట్రిపుల్ తలాక్‌పై సభలో ఏం మాట్లాడకుండా ఒక్కొక్కరం జారుకుని సిగ్గుపడ్డామని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలను చూసి మిగిలిన ఎంపీలు నవ్వుకునే వారని ఆయన అన్నారు. ప్రధాని మోడీతో ఒప్పందంలో భాగంగానే కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు చేశారని విమర్శించారు. 

తన ఆత్మగౌరవం దెబ్బతినడం వల్లనే టీఆర్‌ఎస్‌ను వీడినట్లు తెలిపారు.  పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్ మాట్లాడతారని, కానీ చెప్పించేది కేటీఆరేనని అన్నారు. తన కోపం మహేందర్‌రెడ్డిపై కాదు, కేటీఆర్ మీదేనని అన్నారు. తాను తాండూరు వెళ్లినప్పుడల్లా కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చేదని, అన్నా..నువ్వు అటువెళ్లకు...మంత్రి ఫీల్ అవుతున్నాడని చెప్పేవారని అన్నారు.
 
తన డ్రెస్ గురించి కూడా వ్యాఖ్యలు చేసే వాళ్లని విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఉదయం ఎంపీ సుమన్ నుంచి ఫోన్ వచ్చిందని ఆయన చెప్పారు. మూడు రోజులు పార్లమెంట్‌కు వెళ్లొద్దని సుమన్‌ చెప్పారని, ఎందుకని అడిగితే నిరసన అని చెప్పారని అన్నారు. ఆలస్యంగా టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని తప్ప వేరే ఆవేదన తనకు లేదని విశ్వేశ్వర రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

Follow Us:
Download App:
  • android
  • ios