హైదరాబాద్: ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.

గురువారం నాడు రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహాన్ తో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ నివేదిక ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.

ఇంటర్ పరీక్షల వ్యవహారం అత్యంత సున్నితమైందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. విద్యార్ధుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించిందన్నారు. ఈ కుట్రలను తమ ప్రభుత్వం తిప్పికొడుతుందన ఆయన స్ఫష్టం చేశారు.

ఇంటర్ పరీక్షల వ్యవహరంలో కొన్ని పార్టీలు రాజకీయం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా కేసీఆర్ వివరించారు. వాస్తవాలు తెలుసుకోకుండానే విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేశాయని సీఎం వివరించారు. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన విధంగా వ్యవహరించిన విషయాన్ని సీఎం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాడు.

ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో వాస్తవ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్రపతికి నివేదికను అందిస్తానని గవర్నర్ నరసింహాన్ సీఎంకు హామీ ఇచ్చారని సమాచారం.

ప్రస్తుత సచివాలయంలో అనేక సమస్యలున్నాయని, దీని స్థానంలోనే కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు పూనుకొన్న విషయాన్ని సీఎం గవర్నర్ కు చెప్పారు.బూర్గుల రామకృష్ణారావు భవన్ ను తాత్కాలిక సెక్రటేరియట్ గా ఉపయోగిస్తున్నామని కేసీఆర్ గవర్నర్ కు వివరించారు.

సంబంధిత వార్తలు

రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్

తొలిసారి అమరావతిలో గవర్నర్ ఎట్ హోం : చంద్రబాబు దూరం

రాజ్‌భవన్‌లో ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్ (ఫోటోలు)