Asianet News TeluguAsianet News Telugu

రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు

telangana governor narasimhan hosts at home in raj Bhavan hyderabad
Author
Hyderabad, First Published Aug 15, 2019, 5:41 PM IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కాగా ఏపీలోనూ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆధ్వర్యంలో ఎట్ హోం మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి  గవర్నర్ ఉండటంతో హైదరాబాద్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగేది.

ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని పెంపోందించడంతో పాటు రాజకీయ చర్చలకు సైతం ఎట్ హోం వేదికగా నిలిచేది. అయితే హైకోర్టు సహా పాలనా యంత్రాంగం మొత్తం అమరావతిలో కేంద్రీకృతం కావడంతో ఇరు రాష్ట్రాలకు వేరు వేరు గవర్నర్లను నియమించాలని పలువురు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ క్రమంలో నరేంద్రమోడీ మరోసారి అధికారంలోకి రావడంతో ఏపీ, తెలంగాణలకు విడివిడిగా గవర్నర్‌ను నియమించారు. ఈ క్రమంలోనే బిశ్వభూషణ్ హరిచందన్‌ను విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి గవర్నర్‌గా నియమించారు .

ఆయన ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎట్ హోం కార్యక్రమాన్ని అమరావతిలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు హాజరయ్యారు.

తొలిసారి అమరావతిలో గవర్నర్ ఎట్ హోం : చంద్రబాబు దూరం

Follow Us:
Download App:
  • android
  • ios