పొన్నాల భూ కబ్జాకు పాల్పడ్డారా ?

కబ్జా ఆరోపణలొచ్చిన ప్రాంతాలను పరిశీలించిన సభాసంఘం

enquire on ponnala land grabbing under scrutiny

 

పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భూ ఆక్రమణలపై గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

వరంగల్ నుంచి హైదరాబాద్ రహదారి మధ్యలో చాలా చోట్ల ఆయనకు తిరుమల హెచ్చరీస్ పేరుతో భారీ స్థాయిలో పౌల్ట్రీఫాంలున్నాయి.

 

అయితే ఆయన వైఎస్ హయాంలో ఉన్నప్పుడు తన కంపెనీ కోసం పలు చోట్ల భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వినవచ్చాయి. దీనిపై గతంలోనే ప్రభుత్వం సభాసంఘం ఏర్పాటు చేసింది.

 

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామ పరిధిలో అలాగే, తిమ్మాపూర్ గ్రామంలో ఈ రోజు ఆ సభాసంఘం పర్యటించింది.

 

పొన్నాల ఆక్రమించినట్లుగా చెబుతున్న 8 ఎకరాల 39 గుంటల భూమిని పరిశీలించింది.

 

వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్న పొన్నాల అధికార దుర్వినియోగానికి పాల్పడి…. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని తిరుమల హేచరీస్ పేరుతో ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సభాసంఘం తిరుమల హేచరీస్ భూముల పై సర్వే చేసి విచారణ జరిపింది.


అయితే విచారణ వివరాలను ఇంకా మీడియాకు వెల్లడించలేదు.