నాగర్ కర్నూలు: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అమ్మాయిని హత్య చేసి దుండగులు శవాన్ని పెబ్బేరు ఆస్పత్రి వద్ద వదిలి వెళ్లారు.

అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సాయికృష్ణ అనే యువకుడిని, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దోషులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.

వివరాలు అందాల్సి ఉంది...