Asianet News TeluguAsianet News Telugu

‘ఫర్జీ’ చూసి స్పూర్తి పొంది నకిలీ నోట్లు ప్రింట్.. అనుకోకుండా పోలీసులకు చిక్కి.. చివరికి

ఓ వెబ్ సిరీస్ చూసి ఇద్దరు స్నేహితులు నకిలీ నోట్లు ప్రింట్ చేశారు. వాటిని ఒక సారి విజయవంతంగా చలామణిలోకి చేశారు. రెండో సారి కూడా అలాగే చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా పోలీసులకు చిక్కారు. చివరికి ఏమైందంటే? 

Inspired by 'Farzi', fake notes are printed. Accidentally caught by the police..ISR
Author
First Published Feb 4, 2024, 11:53 AM IST

‘ఫర్జీ’ వెబ్ సిరీస్ ను స్ఫూర్తిగా తీసుకుని నకిలీ భారత కరెన్సీని ముద్రించడం  ప్రారంభించిన ముఠాలోని ఇద్దరు సభ్యులను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (బాలానగర్ ) అల్లాపూర్ పోలీసులతో కలిసి శనివారం అరెస్టు చేసింది. వారి నుంచి ప్రింటర్, ల్యాప్ టాప్, ఇంక్ తో పాటు రూ.4.05 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా.. కారణమేంటంటే ?

నకిలీ నోట్లు తయారు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న ఎస్ వోటీ బృందం వరంగల్ కు చెందిన వి.లక్ష్మీనారాయణ (37), ఇ.ప్రణయ్ కుమార్ (26)లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనారాయణ స్వస్థలం వరంగల్. కొన్నేళ్ల కిందట నుంచి హైదరాబాద్ లోనే జీవిస్తున్నాడు. గతంలో ఓ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన బోడుప్పుల్ లో ఉంటూ స్థిరాస్థి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 

ఔరంగజేబు మథుర శ్రీకృష్ణ దేవాలయాన్ని కూలగొట్టాడు - ఆగ్రా పురావాస్తు శాఖ

అతడికి ప్రైవేటు జాబ్ చేసే ప్రణయ్ స్నేహితుడు. అతడిది కూడా వరంగల్ జిల్లానే. ప్రణయ్ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో స్నేహితుడితో కలిసి దొంగ నోట్ల తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు. ఈ క్రమంలో వారికి ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ గురించి తెలిసింది. ఓటీటీలో ఉన్న ఆ వెబ్ సిరీస్ ను రెండు నెలల పాటు చూశారు. ఇలా దాదాపు 150 సార్లు చూసి బాగా అవగాహన పెంచుకున్నారు. అనంతరం నోట్ల తయారీకి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. 

భారతరత్న ఎవరికి ఇస్తారు..? ఎందుకు ఇస్తారు ? అర్హతలేంటి ?

వాటి ద్వారా మొదటి సారి రూ. 3 లక్షల 500 నోట్లను ప్రింట్ చేవారు. వాటిని ప్రణయ్ జగద్దిరిగుట్ట ప్రాంతంలో చలామణిలో చేశాడు. ఇది సక్సెస్ కావడంతో రెండో సారి రూ.4.05 లక్షలను ప్రింట్ చేశారు. వాటిని చాలమణి చేద్దామణి ప్రయత్నించారు. అయితే బాలానగర్‌ ఎస్‌ఓటీ, అల్లాపూర్‌ పోలీసులు నిన్న ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితుల అనుకోకుండా వారికి కనిపించారు. వీరి తీరు పోలీసులకు అనుమానం కలిగించింది.

నమీబియా అధ్యక్షుడు హాగే గీంగోబ్ మృతి..

వారిని సెర్చ్ చేయడంతో దొంగ నోట్లు బయటపడ్డాయి. దీంతో ఈ దొంగనోట్ల గుట్టు రట్టయ్యింది. అనంతరం వారిద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రింటర్ తోపాటు ముద్రణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై అల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios