Asianet News TeluguAsianet News Telugu

భారతరత్న ఎవరికి ఇస్తారు..? ఎందుకు ఇస్తారు ? అర్హతలేంటి ?

భారత ప్రభుత్వం (Government of India) అందించే అత్యున్నత పౌర పురస్కారం (The highest civilian award) భారతరత్న (Bharat Ratna). దీనిని ప్రజా సేవ, కళలు, సాహిత్యం, విజ్ఞాన రంగాల అభివృద్ధి అత్యుత్తమ సేవలు అందించన వారికి అందజేస్తారు. భారత రాష్ట్రపతి (President of India) ఈ పురస్కారాన్ని ప్రధానం చేస్తారు. (L K Advani conferred with Bharat Ratna award)

Who will be given bharat ratna? Why do you give it ? What are the qualifications?..ISR
Author
First Published Feb 3, 2024, 12:11 PM IST

L K Advani : బీజేపీ సీనియర్ నేత,  మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీకి భారత రత్న పురస్కారం అందజేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఆయన మన దేశానికి కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. భారతరత్న పురస్కారం పొందటం పట్ల అద్వానీని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.

బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య రాజీనామా..

కాగా.. అసలు ఏంటీ భారతరత్న పురస్కారం ? దానిని ఎందుకు, ఎవరికి ఇస్తారు ? ఈ అవార్డు పొందాలంటే ఉండాల్సిన అర్హతలేంటి అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో ఉత్పన్నమవుతోంది. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమే ఈ భారతరత్నం. దీనిని జాతి, వృత్తి, స్థానం, లింగ భేదం లేకుండా అందరికీ ఇస్తారు. అయితే ఏదైనా రంగంలో అసాధారణమైన సేవలు అందించిన వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు. 

మేడారం వెళ్తున్నారా ? తొలి మొక్కు ఎక్కడ చెల్లించాలో తెలుసా ? (ఫొటోలు)

కళలు, సాహిత్యం, విజ్ఞాన రంగాల అభివృద్ధికి, ప్రజా సేవలో అత్యున్నత స్థాయి పని తీరు చూపిన వారికి ఈ పౌర పురస్కారాన్ని అందజేస్తారు. భారతదేశ స్వతంత్ర అనంతరం దీనిని 1954 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తూ గౌరవిస్తున్నాం. మొట్ట మొదట ఈ అవార్డు భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ కు లభించింది. అలాగే దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, జేపీ నారాయణ్, అమర్త్యసేన్, ఏపీజే అబ్దుల్ కలాం, లతా మంగేష్కర్ లకు కూడా అవార్డు లభించింది.

ఈ అవార్డును విదేశీ పౌరులకు కూడా ప్రదానం చేయవచ్చు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలాలకు కూడా ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది. పురస్కారాన్ని ఓ వ్యక్తికి మరణానంతరం కూడా ప్రదానం చేయవచ్చు. ప్రతి సంవత్సరం ఈ అవార్డు గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ఇవ్వవచ్చు. ఈ అవార్డును భారత రాష్ట్రపతి ప్రధానం చేస్తారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios