హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వెళ్లనున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ, సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రలు తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషిలను మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తనను ఏపీకి పంపాలంటూ సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇకపోతే స్టీఫెన్ రవీంద్ర సైతం దరఖాస్తు చేశారు. స్టీఫెన్ రవీంద్ర ఏపీ ఐబీ చీఫ్ గా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో 15 రోజుల్లో ఇద్దరు అధికారులు ఏపీకి డిప్యుటేషన్ పై వెళ్లనున్నారు. 

ఇకపోతే శ్రీలక్ష్మీకి కీలక బాధ్యతలు అప్పిగించాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డిప్యుటేషన్ పై ఏపీకి వెళ్తున్న తరుణంలో ఇద్దరు నేతలు సీఎస్ ఎస్కే జోషిని కలిసి మార్గదర్శకాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ తో మాట్లాడిన ఐఎఎస్ శ్రీలక్ష్మి: తెలంగాణ నుంచి ఎపీకి

గురు శిష్యుల చేతిలో ఏపీ పోలీస్ : ప్రక్షాళనపై జగన్ దృష్టి

ఏపీ ఐబీ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర : లైన్ క్లియర్ చేసిన తెలంగాణ సర్కార్

జగన్ ను కలిసిన స్టీఫెన్ రవీంద్ర: ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆగయా..

ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?