అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు పేరు దాదాపు ఖరారైంది. స్టీఫెన్ రవీంద్రను ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే సీఎం వైయస్ జగన్ భావించారు. 

అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో స్టీఫెన్ రవీంద్రపై చర్చించారు. స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించాలని ఆశిస్తున్నానని అతని బదిలీపై చర్చించారు. 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఐజీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర సోమవారం మధ్యాహ్నాం వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి మధ్య ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టుపై చర్చ జరిగింది. వైయస్ జగన్ ప్రభుత్వంలో పనిచేసేందుకు స్టీఫెన్ రవీంద్ర ఆసక్తి చూపింది. 

దీంతో తెలంగాణ సర్కార్ సైతం స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ బదిలీలపై లైన్ క్లియర్ చేసింది. మరో 15 రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా రానున్నారు. ఇరు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి బదిలీలపై లేఖలు రాయడం అలాగే కేంద్ర అనుమతులు పొంది మరో 15 రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఐబీ చీఫ్ గా ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. 

ఇకపోతే స్టీఫెన్ రవీంద్ర దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ గా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ జిల్లాతోపాటు రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పలు సేవలందించారు. అంతేకాదు అనేకసార్లు ఉత్తమ పోలీస్ అధికారిగా పురస్కారాలు సైతం అందుకున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ను కలిసిన స్టీఫెన్ రవీంద్ర: ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆగయా..

ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?