అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

ఇకపోతే స్టీఫెన్ రవీంద్ర ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్ద  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర పోలీస్ శాఖలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న తరుణంలో ఆయన కుటుంబం సభ్యులతోపాటు వైసీపీ నేతలతోనూ సత్సంబంధాలను కలిగి ఉండేవారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. 

అంతేకాదు ఈనెల 30న సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించాలని జగన్ భావించారు. స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపే విషయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తో వైయస్ జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్ర వైయస్ జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..?