Asianet News TeluguAsianet News Telugu

అంకితా రెడ్డి, రియా: వయసు చిన్నదే కానీ ఆలోచన పెద్దది

తోటి చిన్నారులకు సహాయం చేయాలన్న పిల్లల ఆలోచన మానవత్వానికి ఊపిరినిచ్చింది. ఆ చిన్నారులే హైదరాబాద్ లో పదవ తరగతి చదువుతున్న అంకితా రెడ్డి ఒంటెల, రియా తక్కల్.

Hyderabad girls Ankitha Reddy and Riya to speak at UNO
Author
Hyderabad, First Published Nov 15, 2019, 8:21 PM IST

ప్రపంచమే సరిగ్గా పరిచయం లేని వయస్సా ఆ చిన్నారులది. కానీ వారు చేస్తున్న సహాయం చాలా గొప్పది. దానికోసం ఆ అమ్మాయిలు చేస్తున్న కృషి మరింత గొప్పది. ఈ రోజుల్లో పక్కవాడికి ఆపద వస్తే ఎవరైనా పది నిమిషాలు కేటాయించలేని స్థితిలో ఉన్న కాలమిది. అలాంటిది తోటి చిన్నారులకు సహాయం చేయాలన్న ఆ పిల్లల ఆలోచన మానవత్వానికి ఊపిరినిచ్చింది. ఆ చిన్నారులే హైదరాబాద్ లో పదవ తరగతి చదువుతున్న అంకితా రెడ్డి ఒంటెల, రియా తక్కల్. 

ఎవరైనా ప్రాజెక్టు అంటే పరిశోధించటానికో, అధిరోహించటానికో.. లేదంటే ఏదో ఒక అంశం మీదో అలాంటిదేదైనా ఒకటి ఎంపిక చేసుకుంటారు. కానీ ఈ అమ్మాయిల ప్రత్యేకత ఏంటంటే సాటి చిన్నారులకు సహాయం చేయటాన్నే ప్రాజెక్ట్ గా ఎంచుకున్నారు. ఎంచుకోవటమే కాదు దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు కూడా. 

అనాథ పిల్లల కోసం, మానసిక వికలాంగులైన పిల్లల కోసం, వారి చదువుల కోసం తమ వంతు సహాయంగా అందరి నుండి విరాళాలు తీసుకొని ఆ పిల్లల ఉన్నతికి తోడ్పడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనిలో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా... ఈ పిల్లలకు మానసిక వికలాంగుల, అనాథ పిల్లల చదువులకు చేయూతనివ్వాలన్న ఆలోచనే రావటమే గొప్ప విషయం. 

అంతే కాదు ఆ మానసిక వికలాంగుల పిల్లల చదువుల కోసం విరాళాల సేకరిస్తున్నారు. ఆ సేకరించిన విరాళాలను ఎప్పటికప్పుడు ఒక సంస్థ ద్వారా ఆ పిల్లల ఉన్నతికి ఉపయోగిస్తూ అందరి ప్రశంశలు పొందుతున్నారు. అంతే కాదు వచ్చే నెల మొదటివారంలో ఐరాసలో (UNO) ఈ ప్రాజెక్ట్ గురించిన విశేషాలను అక్కడ జరిగే సమావేశంలో ప్రసంగించే అరుదైన అవకాశం పొందారు. అతి చిన్న వయసులో యుఎన్ సమావేశంలో దీని గురించి ప్రసంగించి రికార్డ్ సృష్టించనున్నారు ఈ చిన్నారులు. ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయిలకు సాటి చిన్నారుల పట్ల ఏదో చేయాలన్న తపన ఉండటం, అసలు అంత పెద్ద ఆలోచన వచ్చిన వీరిని మనమందరం ఖచ్చితంగా అభినందించాల్సిందే!!

Follow Us:
Download App:
  • android
  • ios