Asianet News TeluguAsianet News Telugu

ర్యాంకు 22 : చెత్త హైదరాబాద్ పరువు తీసింది

కేవలం 112 వార్డులనే బహిరంగ మల విసర్జన లేని వార్డులుగా ప్రకటించడం, ఎక్కడ బడితే అక్కడ కనిపించే చెత్త హైదరాబాద్ పరువు తీశాయి. నిగనిగలాడే హైటెక్ హైదరాబాద్ లో మరొక ‘చెత్త’ హైదరాబాద్ ఉందని కేంద్రం చేసిన సర్వేలో వెల్లడియింది. హైదరాబాద్ ర్యాంకు గత ఏడాది  19 వ స్థానం నుంచి  ఇపుడు  22 వ స్థానానికి పడిపోయింది.

hitech hyderabad is not that swachh with garbage on roads and open defecation in many wards

తెలుగు రాష్ట్రాలలో నిగనిగలాడిన హైదరాబాద్ అంతస్వచ్ఛమయిన నగరం కాదని కేంద్రం చెబుతూ ఉంది.

 

అది ముత్యాల నగరం కావచ్చు,హైటెక్ సిటి కావచ్చు, బిరియాని క్యాపిటల్ కావచ్చు,ఒకటే మాట, హైదరాబాద్ దేశంలో అంత స్వచ్ఛమమయిన నగరమేమీకాదు. అంతర్జాతీయ కంపెనీలు, మాల్స్, టిహబ్ లు... ఇలా ఎన్ని ఉన్నా, ఇదొక్కటే  హైదరాబాద్ కాదు,  ఈ జిగేల్ కు దూరంగా మరొక హైదరాబాద్ ఉంది. దాన్ని విస్మరించడంతో  చెడ్డ పేరు హైదరాబాద్ మొత్తానికి వచ్చింది.


 కేంద్రం నిర్వహించిన స్వచ్ఛత సర్వేలో హైదరాబాద్ దేశంలో 22వ ర్యాంకు లో బాగా వెనకబడి పోయింది.. అంటే హైదరాబాద్ టాప్ టెన్ నగరాలలో లేదన్న మాట. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 ఫలితాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిన్నవిడుదల చేశారు.


మున్సిపాలిటీల డాక్యుమెంటేషన్, ప్రత్యక్ష పరిశీలన, పౌరుల స్పందన తదితర అంశాల ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహిస్తారు.వీటిప్రాతిపదికన పరిశుభ్రతలో  నగరాలకు ర్యాంకులిచ్చారు. ఈ జాబితాలో అఖిల భారత స్థాయిలో  విశాఖపట్నం మూడోస్థానంలో నిలించిందివ, తిరుపతి 9వ స్థానం దక్కించకుంది.


స్వచ్ఛత లో హైదరాబాద్ ఎపుడూ మేటి నగరంగా లేదని  ఎన్ డిఎ  ప్రభుత్వం వచ్చాక మొదలయిన ఈ సర్వేలు చెబుతున్నాయి.  2016లో 73 పట్టణాలలో సర్వే చేసినపుడు హైదరాబాద్ కు 19 వ ర్యాంకు వచ్చింది.


ఎందుకిలా జరిగింది?

 

నిగనిగలాడే హైదరాబాద్ కాకుండా, మరొక హైదరాబాద్ కూడా తెలంగాణా రాజధానిలోఉంది. అది చెత్తా కుండీ ల హైదరాబాద్. బహిరంగ మలవిసర్జన హైదరాబాద్. హైదరబాద్ సిటిలో ఎక్కడ బడితే అక్కడ మునిసిపల్ చెత్త కుండీలు కనిపిస్తాయి. చెత్తకుండీలు లేని రోడ్ చివర్లుండవేమో. కొన్ని చోట్ల చెత్త కుండీల వల్ల రోడ్లు కూడా ఇరకయి ఉంటాయి.

 

హైదరాబాద్ ఎంత స్వచ్ఛంగా ఉందో చూద్దామని ఎవరయినా బైక్ వైసుకుని నాలుగు రోడ్ల తిరిగితే, హైదరాబాద్ స్వచ్ఛత తెలుస్తుంది. ఎస్ ఆర్ నగర్, హిమయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 19,  ఈస్ట్ మారెడ్ పల్లి, కోటి వుమెన్స్ కాలేజీ వంటిచోట్ల కూడా పొర్లుతున్నచెత్త కుండీలు దర్శనమిస్తాయి. హైదరాబాద్ కు అపకీర్తి తెచ్చిన ప్రధాన మయిన వాటిలో హైదరాబాద్  రోడ్ల మీద ఉన్న గార్బేజ్ వ్యవహారం ముఖ్యమయింది. 19 వ స్థానంనుంచి హైదరాబాద్ ను 22 వస్థానానికి గుంజేసిన మరొక మహమ్మారి బహిరంగ మల విసర్జన. చెప్పాల్సిన పనిలేదు, ఒక నగరం స్వచ్ఛత విషయంలో ఇదేంత పాత్ర పోషిస్తుందో. ఒపెన్ డిఫకేషన్ ప్రీ (ఒడిఎఫ్)అనే చాలా ముఖ్యమయిన క్వాలిఫికేషన్. దీంట్లో మత్యాల నగరం,హైటెక్ నగరం, బిరియానీ నగరం ఫెయిలంది. మునిసిపల్ డాక్యుమెంటేషన్ సెగ్ మెంట్లోకి ఈ విషయం వస్తుంది. ఇందులో హైదరాబాద్ బాగావెనకబడిందని అధికారులుచెబుతున్కారు. ఈ క్యాటగిరిలో 900 కు గాను వచ్చిన మార్కులు 730 మాత్రమే. కారణం ఎమిటంటే, హైదరాబాద్ లోని 150 వార్డులలో  ఒడిఎఫ్ గా జిహెచ్ ఎంసి ప్రకటించింది కేవలం 112 వార్డులను మాత్రమే.

 

స్వచ్ఛ భారత్ పరిశీలక బృందాలు హైదరాబాద్ కు 500 కు గాను వేసిన మార్కులు కేవలం 428 మాత్రమే. కన్ స్ట్రక్షన్ డెమోలిషన్ వేస్టు పడేయడంలో హైదరాబాద్ కు 25  మార్కులు పోయాయి. పబ్లిక్ టాయ్ లెట్స్ నిర్మాణంలో లక్ష్యం 50 పూర్తయింది. ప్రజల అభిప్రాయాల క్యాటగిరిలో 600లకు 443  మార్కులే వచ్చాయి.

 

 హైదరాబాద్ పడిపోతే, స్వచ్ఛ సర్వేక్షణ్‌–2017 సర్వేలో విశాఖపట్నం, తిరుపతి నగరాలు టాప్‌–10లో నిలిచి అవార్డులు అందుకున్నాయి. టాప్‌–50లో ఆంధ్రప్రదేశ్‌నుంచి 8 పట్టణాలున్నాయి. 2014లో 141వ స్థానంలో ఉన్న తిరుపతి 2017 సర్వేనాటికి 9వ స్థానానికి మెరుగుపడింది.ఈసారి  494 నగరాలు, పట్టణాల్లో నిర్వహించారు.

 

ఇతర తెలుగుపట్టణాలు వాటి ర్యాంకులు ఇలా ఉన్నాయి.

 

ఆంధ్రప్రదేశ్:తిరుపతి (9), తాడిపత్రి (31), నర్సరావు పేట (40),కాకినాడ(43) తెనాలి(44).

 

తెలంగాణా : వరంగల్ (28), సూర్యాపేట(30), సిద్దిపేట(45),నిజాంబాద్ (178), మిర్యాలగూడ(182).

 

అయితే, మెట్రోనగరాలలో హైదరాబాద్ స్వచ్ఛంగా ఉందనే కొంత వూరట.హైదరాబాద్ స్వచ్ఛంగా లేకపోవడానికి మునిసిపాలిటికి ఎంత బాధ్యత ఉందో  పౌరులకూ అంతే బాధ్యత అంతే ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios