Asianet News TeluguAsianet News Telugu

9ఏళ్ల తర్వాత దొరికిన శవం: ఇద్దరు భార్యలతో కాపురం, ఎఫైర్ ఉందంటూ ఇలా..

 ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్యను  అత్యంత దారుణంగా హత్య చేసిన హన్మంత్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మంత్‌ చెప్పిన ఆధారంగా  పోలీసులు  లింగమ్మ అలియాస్ లింగమ్మ అవశేషాలను మర్రిగూడ బావి నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

Heartbreaking story of Brother's 9 yrs search for Sister
Author
Nalgonda, First Published Aug 12, 2018, 10:49 AM IST


మర్రిగూడ: ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్యను  అత్యంత దారుణంగా హత్య చేసిన హన్మంత్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మంత్‌ చెప్పిన ఆధారంగా  పోలీసులు  లింగమ్మ అలియాస్ లింగమ్మ అవశేషాలను మర్రిగూడ బావి నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

తన సోదరి ఆచూకీ కోసం  ఉపేందర్  9 ఏళ్లు డిటెక్టివ్ మాదిరిగా చేసిన పరిశోధనకు  ఫలితం దక్కింది. అయితే తన సోదరి ప్రాణాలతో  ఉంటుందని భావించినా ఉపేంద్రకు నిరాశే మిగిలింది.

లింగమ్మ అలియాస్ ప్రియాంక  చనిపోయిందని ఉపేంద్రకు తెలిసింది. ఈ విషయం తెలిసి ఉపేంద్ర కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే హన్మంత్ చేసిన దురాగతం బట్టబయలైంది. 

 నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన జంగయ్యకు ప్రియాంక అలియాస్ లింగమ్మ,ఉపేందర్‌ సంతానం. బతుకుదెరువు నిమిత్తం జంగయ్య భార్య, బిడ్డలతో కలసి 2006లో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు వలస వెళ్లాడు. 

అక్కడే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియాంకకు అక్కడే క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న మర్రిగూడ మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన మోరా హనుమంతు పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

హన్మంత్  ప్రియాంకను  2006లో వివాహం చేసుకొన్నాడు.  అయితే ప్రియాంక కుటుంబసభ్యులకు తెలియకుండానే హన్మంత్  హైద్రాబాద్‌లోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు.  వీరికి ఓ కొడుకు, కూతురు పుట్టారు.

అయితే కూతురు తనకు పుట్టలేదని హన్మంత్  ప్రియాంకను వేధింపులకు గురిచేశాడు.  వివాహేతర సంబంధం కారణంగానే  రెండో సంతానం కలిగిందని హన్మంత్ ప్రియాంకను వేధించేవాడు.  దీంతో కూతురును ప్రియాంక వేరేవారికి దత్తత ఇచ్చింది. 

ప్రియాంకపై మోజు తీరాక స్వగ్రామం వెంకేపల్లిలో వ్యవసాయ పనులు చేసుకొంటానని చెప్పి ఎక్కువగా అక్కడే ఉండడం ప్రారంభించాడు. అంతేకాదు  కుటుంబసభ్యులు కుదిర్చిన మరో యువతిని హన్మంత్ పెళ్లి చేసుకొన్నాడు. 

ఇద్దరూ భార్యలతో కాపురం సాగించాడు. అయితే ప్రియాంక బాగోగులు పట్టించుకోలేదు. అయితే హన్మంత్ తనను వదిలేసి ఎక్కువ కాలం స్వగ్రామంలోనే గడపడంపై  ఆమె నిలదీసింది. దీంతో హన్మంత్ ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.

 2009 చివరలో హనుమంతు రెండోభార్య, అతడి తల్లిదండ్రులు ఓ శుభకార్యం కోసం ఊరెళ్లారు. ఇదే అదనుగా భావించిన హనుమంతు, ప్రియాంక వద్దకు వచ్చి మాయమాటలు చెప్పాడు. వ్యవసాయ పనులు చక్కబెట్టొద్దామంటూ కారులో మర్రిగూడ మండలం వెంకెపల్లికి తీసుకొచ్చాడు. అదే రోజు రాత్రి ఆమెతో గొడవపడి ప్లాస్టిక్‌ వైరుతో గొంతునులిమి చంపాడు. 

మృతదేహన్ని గోనెసంచిలో మూటకట్టి కారు డిక్కీలో వేసుకుని, రాంరెడ్డిపల్లి శివారుకు తీసుకెళ్లి  వ్యవసాయ బావిలో వేశాడు. అనంతరం ప్రియాంకకు పుట్టిన కుమారుడిని కొండమల్లేపల్లికి చెందిన తన సమీప బంధువుకు ఇచ్చేసి అప్పటినుంచి రెండోభార్య, పిల్లలతో  జీవనం సాగిస్తున్నాడు. 

 హనుమంతు ఇచ్చిన  సమాచారం మేరకు పోలీసులు శనివారం రాంరెడ్డిపల్లి శివారులోని బావి నుండి ఎముకలు సేకరించారు. తొమ్మిదేళ్ల క్రితం మృతదేహాన్ని మూటగట్టిన గోనెసంచి అవశేషాలు, నాడు హనుమంతు ప్రియాంక మృతదేహంతో పాటు పడవేసిన కారు మ్యాట్‌ను, పుర్రె, ఎముకలు, కేశాలు, ప్లాస్టిక్‌ చెప్పులు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఎముకలు, కేశాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఈ వార్తలు చదవండి

9 ఏళ్ల తర్వాత డెడ్‌బాడీ: భార్యకు అఫైర్, అందుకే చంపానన్న హన్మంత్

అక్కను చంపిన బావ: డిటెక్టివ్ అవతారమెత్తిన బావమరిది

ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు: హత్య చేసి 9 ఏళ్లు దాచాడు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios