హైదరాబాద్‌: ప్రేమించి పెళ్లి చేసుకొన్న లింగమ్మ అలియాస్ ప్రియాంకను వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే హనుమంతు చంపాడని నల్గొండ ఎస్పీ రంగనాథ్ ప్రకటించారు. మర్రిగూడసమీపంలోని పాడుబడిన బావిలో కుళ్లిపోయిన మృతదేహన్ని స్వాధీనం చేసుకొన్నట్టు  ఆయన చెప్పారు.

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన లింగమ్మ అలియాస్ ప్రియాంకను కారు డ్రైవర్ హనుమంతు ప్రేమించి  పెళ్లి చేసుకొన్నాడు. 2004లో వీరి వివాహం జరిగింది. 2006 వరకు వీరి కాపురంలో ఎలాంటి విబేధాలు లేవు.  అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని హనుమంతు భావించాడు.

ఈ విషయమై ఆమెతో గొడవ పెట్టుకొన్నాడు.2006లో తన స్వగ్రామమమైన  వెంకేపల్లికి తీసుకొచ్చి లింగమ్మ అలియాస్ ప్రియాంకను  హత్య చేసి పాడుబడిన బావిలో వేశాడు.  చిన్న కూతురు తనకు పుట్టలేదని వేరే వ్యక్తితో సంబంధం కారణంగానే ఆ బాలిక పుట్టిందని భావించిన హన్మంత్ భార్యను చంపి ఇద్దరు పిల్లలను విక్రయించాడు.

తన సోదరి కోసం  ఉపేంద్ర 9 ఏళ్లుగా కష్టపడి వెతికాడు. హన్మంత్  గ్రామం వెంకేపల్లికి వెళ్లి విచారిస్తే  అసలు విషయం వెలుగు చూసింది.దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు హన్మంత్ ను అరెస్ట్ చేసి  విచారిస్తే  అసలు విషయాన్ని  ఒప్పుకొన్నాడు.  

అయితే 12 ఏళ్ళ క్రితం విక్రయించిన పిల్లలను కూడ వెతికి పట్టుకొని వారికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి శాస్త్రీయంగా ఆధారాలను సేకరిస్తున్నట్టు చెప్పారు.

ఈ వార్తలు చదవండి:

అక్కను చంపిన బావ: డిటెక్టివ్ అవతారమెత్తిన బావమరిది

ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు: హత్య చేసి 9 ఏళ్లు దాచాడు