Asianet News TeluguAsianet News Telugu

అక్కను చంపిన బావ: డిటెక్టివ్ అవతారమెత్తిన బావమరిది

తన సోదరి ఆచూకీని కనిపెట్టేందుకు  ఉపేంద్ర ప్రతి చిన్న అవకాశాన్ని కూడ వినియోగించుకొన్నాడు. ఫేస్‌బుక్ ఆధారంగా  తన అక్క , బావ ఎక్కడ ఉన్నాడో కనుగొన్నాడు. కానీ,  ఆ గ్రామానికి వెళ్లేసరికే  తన అక్క చనిపోయిందనే విషయాన్ని తెలుసుకొన్న ఉపేంద్ర  షాక్‌కు గురయ్యాడు.

upendra demands to punish Hanumanth for killing his sister
Author
Hyderabad, First Published Aug 10, 2018, 2:52 PM IST

హైదరాబాద్: తన సోదరి ఆచూకీని కనిపెట్టేందుకు  ఉపేంద్ర ప్రతి చిన్న అవకాశాన్ని కూడ వినియోగించుకొన్నాడు. ఫేస్‌బుక్ ఆధారంగా  తన అక్క , బావ ఎక్కడ ఉన్నాడో కనుగొన్నాడు. కానీ,  ఆ గ్రామానికి వెళ్లేసరికే  తన అక్క చనిపోయిందనే విషయాన్ని తెలుసుకొన్న ఉపేంద్ర  షాక్‌కు గురయ్యాడు.  ప్రేమించి పెళ్లి చేసుకొన్న బావ హన్మంత్‌ తన సోదరిని హత్య చేశాడని తెలుసుకొని  ఉపేంద్ర తట్టుకోలేకపోయాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉపేంద్ర ఫిర్యాదు మేరకు  పోలీసులు హన్మంత్ ను అరెస్ట్ చేసి  విచారణ చేస్తున్నారు. 

9 ఏళ్లపాటు తమకు దూరమైన అక్క కోసం ఉపేంద్ర తిరగని ప్రదేశం లేదు.  అయితే ఎట్టకేలకు  ప్రేమించి పెళ్లి చేసుకొన్న హన్మంత్ అనే వ్యక్తి తన సోదరిని హత్య చేసిన విషయాన్ని తెలుసుకొన్న ఉపేంద్ర  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన సోదరిని  చంంపిన హన్మంత్ ను కఠినంగా శిక్షించాలని ఆయన  డిమాండ్ చేస్తున్నారు.

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని వెంకపల్లికి చెందిన హన్మంత్‌ 12 ఏళ్ల క్రితం లింగమ్మ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.  హైద్రాబాద్‌లో కార్పెంటర్‌గా పనిచేసే సోదరులకు  భోజనం వండిపెట్టేందుకు లింగమ్మ హైద్రాబాద్‌కు వచ్చింది.ఆ సమయంలో హన్మంత్‌ లింగమ్మను  కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలోనే లింగమ్మ కోసం సోదరుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుండి  ఆమె కోసం గాలిస్తున్నాడు.

హన్మంత్ కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. హైద్రాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోనే తమ సోదరి లింగమ్మతో హన్మంత్ కాపురాన్ని పెట్టాడు. 2009లో తన సోదరి గర్భవతిగా ఉన్న సమయంలో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన సమయంలోనే తాను చివరి సారిగా  తన సోదరిని చూసీనట్టు  లింగమ్మ సోదరుడు ఉపేంద్ర చెబుతున్నాడు.

తాము ఉంటున్న అడ్రస్ తెలిసిందనే ఉద్దేశ్యంతో హన్మంత్ ఇల్లు మార్చాడని ఉపేంద్ర చెప్పారు.  9 ఏళ్లుగా తన సోదరి కోసం తిరుగుతున్నట్టు ఆయన చెప్పారు.  అయితే ఫేస్‌బుక్‌లో ఎం.హన్మంత్  పేరుతో ఉన్న ఫ్రోఫైల్‌లో ఉన్న ఫోన్ నెంబర్‌కు క్యాబ్ కావాలని ఫోన్ చేసినట్టు ఉపేంద్ర చెప్పారు. 

అయితే శ్రీశైలం వెళ్లేందుకు క్యాబ్ కావాలని కోరితే  కుటుంబసభ్యులు మొత్తం ప్రయాణం చేసేందుకు అవసరమైన  పెద్ద వాహనాన్ని బుక్ చేసుకోవాలని క్యాబ్ డ్రైవర్ సూచించారు. అయితే ఈ సమయంలోనే తాను తన బావ హన్మంత్ గురించి వాకబు చేస్తే  లోయపల్లి, వెంకపల్లి గ్రామాల అడ్రస్‌లు ఇచ్చారు.ఈ అడ్రస్ ఆధారంగా వెంకపల్లి గ్రామానికి వెళ్తే  హన్మంత్ , లింగమ్మలు ఇదే గ్రామంలో చాలా కాలం పాటు ఉన్నారని గ్రామస్తులు తెలిపినట్టు  ఆయన గుర్తు చేశారు.

లింగమ్మను కొట్టి చంపి గ్రామంలోని బావిలో వేశాడని చెప్పాడన్నారు.  అయితే ఇద్దరు పిల్లలను  వేర్వేరు గ్రామాల్లో విక్రయించాడని  తెలిసి ఉపేంద్ర కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. వారం రోజుల క్రితం వెంకపల్లి గ్రామానికి తాను వెళ్లిన విషయాన్ని తెలుసుకొన్న హన్మంత్  తనకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని  ఉపేంద్ర చెప్పారు.

ఈ విషయమై తాను మర్రిగూడ  పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఉపేంద్ర చెప్పారు. పోలీసులు హన్మంత్‌ను అదుపులోకి తీసుకొని  దర్యాప్తు చేస్తున్నారని ఉపేంద్ర చెప్పారు. 

నా సోదరి ఇంకా బతికే ఉందని  మా అమ్మ అనుకొంటుందన్నారు.  మా నాన్న చనిపోయాడని ఉపేంద్ర విలపిస్తున్నాడు. రాఖీ పండుగ రోజు మా అక్క వస్తోందని  ఏళ్ల తరబడి  ఎదురుచూస్తున్నామని ఉపేంద్ర కన్నీళ్లు పెట్టుకొంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకొన్న  మా అక్కను చంపిన  హన్మంత్ ను కఠినంగా శిక్షించాలని  ఉపేంద్ర డిమాండ్ చేస్తున్నారు. 

ఈ వార్త చదవండి:ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు: హత్య చేసి 9 ఏళ్లు దాచాడు
 

Follow Us:
Download App:
  • android
  • ios