Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణకు స్మారక స్తూపం.. కెసీఆర్ పై నెటిజన్ల ట్రోల్స్

నందమూరి అభిమానులకు, తెలంగాణ వాదులకు మధ్య ఈ విషయంలో చిన్నవాటి వార్ జరుగుతోంది. మరి దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Govt land for Nandamuri Harikrishna's memorial, gun salute spark row
Author
Hyderabad, First Published Aug 31, 2018, 1:20 PM IST

సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించింది. అంతేకాకుండా  మహాప్రస్థానంలో  హరికృష్ణ జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం స్మృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో 450 గజాల స్థలంలో స్మారక స్తూపం, పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు.  హరికృష్ణ స్మారక స్తూపం కోసం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కేటాయించిన 450 గజాల స్థలాన్ని ఆయన కుటుంబసభ్యులకు తక్షణమే అప్పగిస్తున్నట్లు కూడా ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే కేసీఆర్ కి చిక్కొచ్చి పడింది.  హరికృష్ణ కోసం స్మారక స్తూపం నిర్మిస్తాననడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఊరుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. 

ఒక వ్యక్తి అయితే ఏకంగా హరికృష్ణకి ఎలా స్మారక స్తూపం ఏర్పాటు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దేశానికి సేవ చేసిన వారికి లేదా  స్ఫూర్తిదాతలకు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులకు మాత్రమే ఇవి ఏర్పాటు చేస్తారన్నారు. ఏ కేటగిరిలో హరికృష్ణకు స్మారక స్తూపం ఏర్పాటు చేస్తారని మండిపడ్డారు. అయితే.. నందమూరి అభిమానులు మాత్రం స్మారక స్తూపం ఏర్పాటు చేయడానికి హరికృష్ణ అర్హుడని భావించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్ కి దన్యవదాలు తెలుపుతున్నారు.

ఒకరకంగా నందమూరి అభిమానులకు, తెలంగాణ వాదులకు మధ్య ఈ విషయంలో చిన్నవాటి వార్ జరుగుతోంది. మరి దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

మరిన్ని సంబంధిత వార్తలు

హరికృష్ణ విషయంలో... మరో అడుగు ముందుకేసిన తెలంగాణ ప్రభుత్వం

ప్రమాదానికి ముందు అక్కడ కాసేపు ఆగిన హరికృష్ణ

ఎన్టీఆర్ విలపిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది!    

హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం

అన్న మరణంతో బాలయ్య కన్నీరుమున్నీరు!

హరికృష్ణ మృతి: మీడియాకి మంచు మనోజ్ రిక్వెస్ట్!

తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చిన హరికృష్ణ

ఆ ఘటనతోనే హరికృష్ణ బాగా కుంగిపోయారట

Follow Us:
Download App:
  • android
  • ios