నందమూరి హరికృష్ణ ఇకలేరు అనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వార్త విన్న దగ్గర నుంచి హరికృష్ణ కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  మరికొందరేమో.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

ఈ రోజు ఉదయం ఓ రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయనకు సంబంధించిన ఓ విషయాన్ని దగ్గరి సన్నిహితులు ఒకరు వివరించారు. ఆయన కుటుంబాన్ని ఎంతగా ప్రేమించేవారో తెలియజేశారు.

‘‘నందమూరి హరికృష్ణ.. చూడడానికి ఎంత గంభీరంగా కనిపించేవారో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించేవారు. ఆయనకు కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను కంటికి రెప్పలా చూసుకునేవారు. అలాంటి సమయంలో పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నల్గొండ జిల్లాలో జరిగిన ఆ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. కొడుకు మృతితో హరికృష్ణ తల్లడిల్లిపోయారు. ఈ ఘటనతో హరికృష్ణ బాగా కృంగిపోయారు. అప్పట్లో ఆయన ఆరోగ్యం బాగా క్షిణించింది. ఈ సంఘటన జరిగిన ఎన్నో నెలలకు గానీ ఆయన మనిషి కాలేకపోయారు.’’ అని వివరించారు.

ఇక్కడ హరికృష్ణ మృతి..అక్కడ పెళ్లిమండపంలో విషాదఛాయలు

పోస్ట్ మార్టం పూర్తి..రేపే అంత్యక్రియలు.. ఎక్కడంటే

హరికృష్ణ మృతి... చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆస్పత్రికి చేరుకున్న తెలంగాణ మంత్రి

కామినేని ఆస్పత్రికి చంద్రబాబు: ఇతర దృశ్యాలు