నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించిన విజువల్స్ అన్ని సోషల్ మీడియా అకౌంట్ లలో, ఛానెళ్లలో ప్రసారం చేస్తున్నారు.
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించిన విజువల్స్ అన్ని సోషల్ మీడియా అకౌంట్ లలో, ఛానెళ్లలో ప్రసారం చేస్తున్నారు. వీటి దయచేసి ఆపాలని కోరుతున్నారు హీరో మంచు మనోజ్. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా మీడియాకి రిక్వెస్ట్ చేశారు.
''ఊహించని విధంగా ఈ ప్రమాదంలో తమ ఆత్మీయుడిని కోల్పోయిన అనుచరులు, కుటుంబ సభ్యులకు మీడియాలో వచ్చే దృశ్యాలు మరింత బాధను కలుగజేస్తాయి. ఆయన మనందరి మనిషి. దయచేసి ఆయన్ని గౌరవిద్దాం. నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటారని భావసితున్నాను. ధన్యవాదాలు'' అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై స్పందించిన నందమూరి అభిమానులు.. హరికృష్ణ ఆకస్మిక మృతి తమను తీవ్రంగా కలిచివేస్తోందని, టీవీల్లో చూపించే దృశ్యాలు మరింత క్షోభకి గురి చేస్తున్నాయని అంటున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రమాద వీడియోలు షేర్ చేయడం ఆపాలని మరికొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
