తన అన్నయ్య హరికృష్ణ మరణ వార్త విని నందమూరి బాలకృష్ణ కంటతడి పెట్టారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన కారు యాక్సిడెంట్ లో మృతి చెందారు
తన అన్నయ్య హరికృష్ణ మరణ వార్త విని నందమూరి బాలకృష్ణ కంటతడి పెట్టారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన కారు యాక్సిడెంట్ లో మృతి చెందారు. తీవ్ర గాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. ఆయన శరీరం ట్రీట్మెంట్ కి సహకరించకపోవడంతో ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
ఆయన మరణ వార్త విని ఒక్కొక్కరుగా కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా హరికృష్ణ కుటుంబ సభ్యులు వేర్వేరుగా హాస్పిటల్ కి వెళ్లారు. హరికృష్ణ పార్థివదేహాన్ని వీక్షించిన బాలకృష్ణ ఉద్వేగానికి లోనయ్యారు.
కంటతడి పెడుతూ అసలు ఎలా జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Scroll to load tweet…
ఇవి కూడా చదవండి..
హరికృష్ణ మృతి: మీడియాకి మంచు మనోజ్ రిక్వెస్ట్!
